హైదరాబాద్, వెలుగు: పెయింట్, అలంకరణ సంస్థ ఏషియన్ పెయింట్స్ తన ప్రీమియం 'బ్యూటిఫుల్ హోమ్స్' అనే మల్టీ క్లాస్ డెకోర్ షోరూంను సికింద్రాబాద్‌లో ప్రారంభించింది. శివాస్ ఎన్‌క్లేవ్‌లోని బృందావన్ కాలనీలో కొత్త ఏషియన్ పెయింట్స్ బ్యూటిఫుల్ హోమ్స్ స్టోర్ ఉంది.
ఈ అత్యాధునిక స్టోర్ ను ఏషియన్ పెయింట్స్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ అమిత్ సింఘాల్ ప్రారంభించారు. ఈ స్టోర్‌లో రెసిడెన్షియల్, వాణిజ్య ప్రదేశాలకు అవసరమైన హోమ్స్ స్టోర్ ఫర్నీచర్, లైట్లు, కార్పెట్లు, మాడ్యులర్ కిచెన్లు, వార్డ్ రోబ్‌లు, పరుపులు వంటివి ఉంటాయి.
