
స్మార్ట్ఫోన్ మేకర్ లావా బ్లేజ్ ప్రో పేరుతో 5జీ ఫోన్ను లాంచ్ చేసింది. ఇందులో 6.78-అంగుళాల డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, వెనుక 50- ఎంపీ కెమెరాతో కూడిన డ్యూయల్ వెనుక కెమెరా యూనిట్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ప్రత్యేకతలు ఉంటాయి. ధర 12,499. వచ్చే నెల 3 నుంచి అమ్మకాలు మొదలవుతాయి.