Lava Storm 5G స్మార్ట్ ఫోన్.. లుక్ అదరగొడుతోంది.. ధర రూ.12వేలు మాత్రమే

 Lava Storm 5G  స్మార్ట్ ఫోన్.. లుక్ అదరగొడుతోంది.. ధర రూ.12వేలు మాత్రమే

5G లో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ..తక్కువ ధరలో 5G స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికోసం లావా కంపెనీ లావా స్టార్మ్ 5G స్మార్ట్ ఫోన్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ MediaTek Dimentsity6080 సిస్టమ్ ఆన్ చిప్ తో 8GB RAM, 128 GB ఆన్ బోర్డ్ స్టోరేజ్ ను అందిస్తోంది. Lava Storm 5G స్మార్ట్ ఫోన్ గేల్ గ్రీన్, థండర్ బ్లాక్ రంగులలో లావా ఇ స్టోర్, అమెజాన్ ఇండియాలో కొనుగోలు చేయడానికి అందుబాటులోఉంది. ఇంట్రడ్యూసింగ్ ఆఫర్లు, బ్యాంకు ఆఫర్ల ద్వారా Lava Storm 5G స్మార్ట్ ఫోన్ పై రూ. 15,00 ల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ వారంటీ సమయంలో కస్టమర్ ఇంది వద్ద ఉచిత సర్వీస్ అందిస్తోంది. 
లావా స్టార్మ్ 5G ఫీచర్లు: 
Lava 5G స్మార్ట్ ఫోన్ 6.78 అంగుళాల ఫుల్ HD+IPS డిస్ ప్లేతో 120 Hz రీఫ్రెష్ రేట్ ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ Widevine L1కి మద్దతు ఇస్తుంది. ఇది పూర్తి రిజల్యూషన్ లో ఓవర్ ది టాప్ ప్లాట్ ఫారమ్ ల ద్వారా డిజిటల్ హక్కుల నిర్వహణలో పూర్తి సెక్యూరిటీతో కంటెంట్ ను ప్రసారానికి అనుమతిస్తుంది. మెడిటెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్ స్టాక్ యూజర్ ఇంటర్ ఫేస్ తో ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ ను బూట్ చేస్తుంది. 

కెమెరాల విషయానికి వస్తే 50 మెగాపిక్సల్ మెయిన్ సెన్సార్ , 8BMP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ తో బ్యాక్ డ్యుయల్ కెమెరా సెటప్ ఉంటుంది. పంచ్ హోల్ డిజైన్ లో 16MP ఫ్రంట్ కెమెరా సెన్సార్ ఉంటుంది. స్మార్ట్ ఫోన్ ఫిల్మ్, స్లోమోషన్, టైమ్ లాప్స్, UHD, Gif,  బ్యూటీ, ఇంటెలిజెంట్ స్కానింగ్ వంటి వివిధ కెమెరా మోడ్ లను అందిస్తుంది. లావా స్టార్మ్ 5G 5000mAh బ్యాటరీ, USB-C కనెక్టర్ ద్వారా 33W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ మద్దతు ఇస్తుంది. 

Lava Storm 5G స్మార్ట్ ఫోన్ ధర రూ. 11,999 లు మాత్రమే.