
పోయినేడు రిలీజైన ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’లో హాకీ ప్లేయర్‌గా, ‘చావు కబురు చల్లగా’లో యంగ్ విడోగా కనిపించిన లావణ్యా త్రిపాఠి.. ఈసారి ఒక క్రేజీ క్యారెక్టర్‌తో రాబోతోంది. ‘మత్తు వదలరా’ ఫేమ్ రితేష్ రాణా దర్శకత్వం వహిస్తున్న ‘హ్యాపీ బర్త్ డే’ చిత్రంలో ఇది వరకు ఎన్నడూ చేయని పాత్రలో నటిస్తోంది లావణ్య. నరేష్ అగస్త్య, వెన్నెల కిశోర్, సత్య ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని జులై 15న విడుదల చేయనున్నట్టు నిన్న ప్రకటించారు. ఈ సందర్భంగా కొన్ని పోస్టర్స్‌ని కూడా రిలీజ్ చేశారు. మోడర్న్‌గా రెడీ అయిన లావణ్య.. ఓ పోస్టర్లో సంతోషంగా నవ్వుతోంది. మరో పోస్టర్లో హుషారుగా ఎగిరి గంతేస్తోంది. అయితే ఆమె చుట్టూ కొందరు మెషీన్ గన్స్ పట్టుకుని ఉన్నారు. వాటిని లావణ్య వైపే గురిపెట్టారు. పోస్టర్లపై ‘నో గన్స్, నో ఎంట్రీ’ అని రాసుండటం కూడా సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. మైత్రి మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై చిరంజీవి (చెర్రీ) నిర్మిస్తున్న ఈ చిత్రానికి కాలభైరవ సంగీతం అందిస్తున్నాడు.