నటి రాధికకు లారెన్స్ ఖరీదైన గిఫ్ట్.. అందుకోసమేనా?

నటి రాధికకు లారెన్స్ ఖరీదైన గిఫ్ట్.. అందుకోసమేనా?

ప్రముఖ కోరియోగ్రాఫర్ లారెన్స్ ప్రధాన పాత్రలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ చంద్రముఖి2. 2005 రజనీకాంత్ హీరోగా వచ్చిన చంద్రముఖి సినిమాకు ఇది సీక్వెల్. ఈ షూటింగ్ లో లారెన్స్, నటి రాధికకు బంగారు ఉంగరం, ఖరీదైన వాచ్ గుఫ్ట్ గా ఇచ్చాడట. ఈ విషయాన్ని స్వయంగా రాధికనే తెలిపారు.  అయితే ఈ సినిమాలో రాధిక పాత్ర హైలెట్ కానుందట. ఆపాత్ర లో ఆమె నటనకు లారెన్స్ ఫిదా ఐపోయాడట. అందుకే ఆమెకు అంత ఖరీదైన గిఫ్ట్ ఇచ్చాడని సమాచారం.

ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక సూపర్ స్టార్ రజనికాంత్ హీరోగా 2005లో వచ్చిన హారర్ అండ్ థ్రిల్లర్ మూవీ చంద్రముఖి ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు 18 సంవత్సరాల తరువాత ఈ సినిమాని సీక్వెల్ గా చంద్రముఖి2 తెరక్కుతోంది. మొదటి పార్ట్ ను డైరెక్ట్ చేసిన పి వాసునే ఈ సినిమాను కూడా తెరకెక్కిస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. 

బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో వస్తున్న ఈ సినిమాలో రాఘవ లారెన్స్ హీరోగా చేస్తున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కనున్న ఈ మూవీ.. మొదటి పార్ట్ కు మించి ఉండనుందని డైరెక్టర్ పి వాసు ఇప్పటికే తెలిపారు. చంద్రముఖి సినిమాలాగే ఈ సినిమా కూడా ప్రేక్షకులను మరోసారి భయపెడుతుందా అనేది చూడాలి.