రాజ్యసభలో బీజేపీ విప్‌‌‌‌‌‌‌‌గా లక్ష్మణ్

రాజ్యసభలో బీజేపీ విప్‌‌‌‌‌‌‌‌గా లక్ష్మణ్

న్యూఢిల్లీ, వెలుగు: రాజ్యసభలో బీజేపీ విప్‌‌‌‌‌‌‌‌గా తెలంగాణకు చెందిన ఎంపీ కె.లక్ష్మణ్ నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. లక్ష్మణ్ విద్యార్థి దశ నుంచి బీజేపీ అనుబంధ సంస్థ ఏబీవీపీలో కీలక బాధ్యతలు నిర్వహించారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. రెండు సార్లు ముషీరా బాద్  ఎమ్మెల్యేగా సేవలందించారు. 

అంచెలం చెలుగా ఎదిగిన లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌కు అధిష్టానం ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడి బాధ్యతలు అప్ప గించింది. దీంతో పాటు ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌ నుంచి రాజ్యసభ సభ్యుడిగా 2022 జూన్ 2న ఆయన ఎంపీగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో బీజేపీలో అత్యంత కీలకమైన కేంద్ర పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగా ఆయనను పార్టీ నియమించింది. ప్రస్తుతం రాజ్యసభలో బీజేపీ విప్‌‌‌‌‌‌‌‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. మరోవైపు, చేవెళ్ల ఎంపీ  విశ్వేశ్వర్ రెడ్డిని లోక్‌‌‌‌‌‌‌‌సభలో బీజేపీ విప్‌‌‌‌‌‌‌‌గా పార్టీ ఇప్పటికే నియమించింది.