కాంగ్రెస్​లోకి లక్ష్మణచాంద బీఆర్ఎస్ నేతలు

కాంగ్రెస్​లోకి లక్ష్మణచాంద బీఆర్ఎస్ నేతలు

లక్ష్మణచాంద, వెలుగు: లక్ష్మణచాంద మాజీ సర్పంచ్ బిట్లింగు నారాయణ, 6వ వార్డు మాజీ సభ్యులు మంగళంపల్లి గణేశ్ సహా సుమారు100 మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆదివారం కాంగ్రెస్ లో చేరారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని డీసీసీ అధ్యక్షుడి క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో శ్రీహరి రావు వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా శ్రీహరి రావు మాట్లాడుతూ.. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందన్నారు. పదేండ్ల పాటు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి, అక్రమాలు, భూ దందాలు తప్ప ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలను నాలుగు నెలల్లోనే సీఎం రేవంత్ రెడ్డి అమలుచేసి సత్తా చాటారని అన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణచాంద మండల అధ్యక్షుడు ఓడ్నాల రాజేశ్వర్, ఈటల శ్రీనివాస్, అట్ల రాంరెడ్డి ,అట్ల రవీందర్ రెడ్డి, శేఖర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, నరేశ్ రెడ్డి తదితరులు పొల్గొన్నారు.