బీసీ అజెండాతోనే ఎన్నికలకు పోతాం : లక్ష్మణ్  

బీసీ అజెండాతోనే ఎన్నికలకు పోతాం :  లక్ష్మణ్  

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ అజెండాతోనే పోటీ చేస్తామని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బీసీలను మోసం చేశాయన్నారు. తాము ఆ రెండు పార్టీల కంటే ఎక్కువ సీట్లను బీసీలకు కేటాయిస్తామన్నారు. లక్ష్మణ్ శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ అభ్యర్థుల ఎంపికను ఫైనల్ చేయనుందన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గెలుపు గుర్రాలనే తమ పార్టీ బరిలోకి దింపుతుందన్నారు. ప్రధాని మోదీని ఎదుర్కోలేక బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు.

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడమే లక్ష్యంగా ఈ మూడు పార్టీలు పనిచేస్తున్నాయన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పదేపదే విమర్శలు చేస్తు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఎప్పుడూ కలిసి పని చేయలేదని లక్ష్మణ్ స్పష్టం చేశారు. అధికార బీఆర్ఎస్ పార్టీపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపే బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ వైపు చూస్తున్నారన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రధాని మోదీ తొమ్మిదేండ్లలో రూ. 9 లక్షల కోట్లు ఇచ్చారన్నారు. ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్ రద్దు, చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల వంటి సాహసోపేతమైన నిర్ణయాలు