దేవుడా : ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల తీసివేతలో ఊచకోత..

దేవుడా : ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల తీసివేతలో ఊచకోత..

ఐటీ ఉద్యోగం స్టార్టింగ్ లోనే ఐదు అంకెల జీతం.. ఆఫీసుకు పోవటానికి.. రావటానికి క్యాబ్.. మధ్యాహ్నం ఆఫీసులో ఫుడ్.. ఎప్పుడు కావాలంటే అప్పుడు.. ఎన్ని కావాలంటే అన్ని టీ, కాఫీలు, వారానికి ఐదు రోజులే వర్కింగ్ డేస్.. వీకెండ్ పార్టీలు.. బోనస్ లు.. అబ్బో అసలు ఉద్యోగం అంటే ఐటీ ఉద్యోగం అనేలా.. ఐటీ ఉద్యోగం చేయనోడు సన్నాసి.. పనికి రాని వాడనే అభిప్రాయం నిన్నా మొన్నటికి వరకు ఉండేది. ఏడాది కాలంగా మారిన పరిస్థితులతో ఐటీ ఉద్యోగుల్లో ఆనందం కంటే గుబులు పెరిగింది. ఉద్యోగం ఉంటుందో.. ఎప్పుడు ఊడుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు.


మొన్నటికి మొన్న ఓ కంపెనీ సీఈవో గూగుల్ మీట్ అని ఉద్యోగులు అందర్నీ పిలిచి.. ఏకంగా 200 మందిని తీసి వేస్తున్నట్లు ప్రకటించాడు.. అంతే కాదు.. 2023లో అత్యధికంగా 2 లక్షల 50 వేల ఉద్యోగాలు పోతే.. అదే ఒరవడి 2024లోనూ కొనసాగుతుంది. సంవత్సరం ప్రారంభం అయ్యి 40 రోజులు మాత్రమే అయ్యింది.. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపనీలతో సహా ఏకంగా 32 వేల మంది ఉద్యోగులను తొలగించాయి.

ఇది సాధారణమైన విషయం ఏమీ కాదు.. ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపేది.. 40 రోజుల్లో 32 వేల ఉద్యోగులపై వేటు వేస్తే.. మిగతా ఏడాదిలో పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది.. ఐటీ రంగంలోని ఉద్యోగుల్లో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. సోమవారం పలు కంపెనీలు పెట్టుబడి బారాన్ని తగ్గించుకునేందుకు ఎంప్లాయిస్ ను తీసేస్తున్నట్లు తెలిపారు. snap inc కంపెనీలో 10శాతం (540) మందిని,  Okts inc కంపెనీలో 7శాతం అంటే 400మంది ఉద్యోగులను తీసివేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయా కంపెనీలు తెలిపాయి. పెద్ద పెద్ద కంపెనీలైన అమెజాన్, మెటా, సేల్స్‌ఫోర్స్ వంటి వాటిలో అయితే జాబ్స్ ఊడిపోయే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది.

కోవిడ్–19 విపత్తు, 2022 తర్వాత పెరిగిన వడ్డీ రేట్లే సాఫ్ట్ వేర్ జాబ్స్ లేఆఫ్స్‌కి కారణమని కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు.  ఏఐ రాకతో టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కల్పనలో గత ఏడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు కేవలం 2000 పోస్టింగ్ లే పెరిగాయని comp tia సంస్థ  ఎనాలసిస్ లో తేలింది. 

Also Read :తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు అంతా రెడీ