గడ్డం వంశీకృష్ణ గెలవాలని పూజలు

 గడ్డం వంశీకృష్ణ గెలవాలని పూజలు

చెన్నూరు, వెలుగు: పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గడ్డం వంశీకృష్ణ భారీ మెజార్టీతో గెలవాలని కాంగ్రెస్​ నేత సింగిరెడ్డి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో చెన్నూరు పట్టణంలోని బడా హనుమాన్ ఆలయంలో లీడర్లు, కార్యకర్తలు పూజలు చేసి 101 కొబ్బరికాయలు కొట్టారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. వంశీకృష్ణను ఎంపీగా గెలిపించుకుంటే పెద్దపెల్లి పార్లమెంట్ ప్రాంతం ఇండస్ట్రియల్ కారిడార్​గా అభివృద్ధి చెందుతుందన్నారు. 

యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు జడల సతీశ్, సుశీల్ కుమార్, చల్లా రాంరెడ్డి, చీర్ల సుధాకర్ రెడ్డి, గొడిషెల బాపిరెడ్డి, బొమ్మ రమేశ్, చింతల శ్రీనివాస్, రత్నా భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.