నిజామాబాద్, వెలుగు : గవర్నమెంట్ సలహాదారుడిగా బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డిని బుధవారం నిజామాబాద్ ప్రజాప్రతినిధులు, లీడర్లు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, మరో సలహాదారుడు షబ్బీర్‌అలీ, ఎమ్మెల్యే భూపతిరెడ్డి, స్టేట్ కో-ఆపరేటీవ్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి బొకేలు అందించి సుదర్శన్‌రెడ్డిని అభినందించారు.
బోధన్: ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డిని బుధవారం బోధన్, సాలూర మండలాలకు చెందిన కాంగ్రెస్ లీడర్లు హైదరాబాద్‌లో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. డీసీసీ డెలిగేట్ గంగాశంకర్, కాంగ్రెస్బోధన్ మండలాధ్యక్షుడు నాగేశ్వరరావు, నాయకులు గణపతిరెడ్డి, ఇల్తెపు శంకర్, సంజీవరెడ్డి, రామకృష్ణ ఉన్నారు.
సుదర్శన్ రెడ్డికి విషెస్ తెలిపిన వినయ్ రెడ్డి
ఆర్మూర్ : ప్రభుత్వ సలహాదారుడిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ని బుధవారం కాంగ్రెస్ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి వినయ్ రెడ్డి హైదరాబాద్‌లో కలిసి సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
శుభాకాంక్షలు తెలిపిన బాన్సువాడ లీడర్లు
వర్ని : ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే పి.సుదర్శన్‌రెడ్డిని బుధవారం హైదరాబాద్‌లో కాంగ్రెస్బాన్సువాడ నియోజకవర్గ లీడర్లు ఇందూర్ చంద్రశేఖర్, వెంకట్ రామ్ రెడ్డి, కార్యకర్తలు షైక్ గౌస్, పార్వతి ప్రవీణ్, కర్కా సాయి లక్ష్మణ్, గాండ్ల శ్రీనివాస్, ఫరఖాన్ కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
