
జైనూర్, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ)ని కాగజ్ నగర్‌కు కాకుండా జైనూర్‌కు తరలించాలని ఆదివాసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గురువారం తహసీల్దార్ భీర్షా, ఏఎంసీ చైర్మన్ కుడ్మెత విశ్వనాథ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ ఐకాస రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ కనక యాదవ్ రావు మాట్లాడుతూ.. కాగజ్ నగర్‌లో ఇప్పటికే పలు ఆస్పత్రులు ఉన్నాయని, ఇప్పుడు మరో సీహెచ్సీని అక్కడికే తరలించారని అన్నారు.
ఏజెన్సీ ప్రాంతమైన జైనూర్ మండల గిరిజనులు వైద్యం కోసం 200 కి.మీ దూరంలోని ఆదిలాబాద్ రిమ్స్‌కు వెళ్లాల్సి వస్తోందని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలు, ప్రసవ కేసుల్లో మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయన్నారు. గిరిజను లకు వైద్య సదుపాయాలు అందేలా సీహెహ్సీని జైనూర్‌కు మార్చాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ మిత్ర వెల్ఫేర్ సోసైటీ చైర్మన్ అడా వెంకటేశ్, రాయి సెంటర్ సార్మేడి ఆత్రం ఆనంద్ రావు, మాజీ సర్పంచ్ కుంరం శ్యాంరావు, నాయకులు మెస్రం అంబాజీ రావు, గెడం గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు.