సర్దార్ వల్లభాయ్ పటేల్ నిర్ణయాలు ఐక్యతకు దోహదం చేశాయ్

సర్దార్ వల్లభాయ్ పటేల్ నిర్ణయాలు ఐక్యతకు దోహదం చేశాయ్

సుస్థిర జాతి నిర్మాణానికి సర్దార్​ వల్లభాయ్ ​పటేల్ బాటలు వేశారని, తొలి ఉపప్రధానిగా, హోంమంత్రిగా ఆయన తీసుకున్న నిర్ణయాలు దేశ ఐక్యతకు దోహదం చేశాయని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, యాదగిరిగుట్ట ఏసీపీ శ్రీనివాస్​నాయుడు, పలువురు వక్తలు అన్నారు. పటేల్​150వ జయంతిని ఉమ్మడి నల్గొండ జిల్లాలో నాయకులు, అధికారులు, ప్రజలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆయన ఫ్లెక్సీలకు నివాళి అర్పించారు. 

జిల్లా కేంద్రాల్లో 2 కె రన్​చేపట్టారు. జాతీయ జెండాలతో ర్యాలీలు తీశారు. బీజేపీ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు అశోక్​గౌడ్, నల్గొండ జిల్లా అధ్యక్షుడు వర్షిత్​రెడ్డి, సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు శ్రీలతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.  – వెలుగు, నెట్​వర్క్​