బిగ్డీల్ : హైదరాబాద్లో ఫెడ్ఎక్స్ రూ.800 కోట్ల పెట్టుబడి

బిగ్డీల్ : హైదరాబాద్లో ఫెడ్ఎక్స్ రూ.800 కోట్ల పెట్టుబడి

ప్రముఖ ఎక్స్ప్రెస్ ట్రాన్స్ పోర్టేషన్ కంపెనీ ఫెడెక్స్ హైదరాబాద్లో తన మొదటి బ్రాంచ్ను  మంగళవారం( డిసెంబర్ 5) ప్రారంభించింది. ప్రపంచ ప్రపంచంలోనే అతిపెద్ద ఎక్స్ ప్రెస్ ట్రాన్స్ పోర్టేషన్ కంపెనీలలో ఒకటైన ఫెడెక్స్ ఎక్స్ ప్రెస్ రూ.800 కోట్ల(100 మిలియన్ డాలర్లు ) పెట్టుబడితో  హైదరాబాద్లో FedEx ACC ను స్థాపించింది. 

టాలెంట్, ఇన్నోవేషన్లలో పెట్టుబడులు పెడుతున్నాం. టాలెంట్ పూల్ ను ఉపయోగించుకొని డిజిటల్ రంగంలో వేగవంతంగా అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా , వినియోగదారుల సమస్యల పరిష్కారాలను అందించేందుకు ఈ కంపెనీ స్థాపించినట్లు ఫెడెక్స్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజ్ సుబ్రమణ్యం తెలిపారు. 

ఇండియాలో డిటిజన్ ట్రాన్స్ ఫార్మేషన్, ఇన్నోవేషన్లలో ప్రతిభను వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని కంపెనీ మేనేజ్ మెంట్  ప్రకటించింది. FedEx ACC టెక్నాలజీ, డిజిటల్ ఇన్నోవేషన్లు కేంద్రంగా పనిచేస్తుంది. FedEx ACC ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. కొత్త సామర్థ్యాల అభివృద్దికి దోహదం చేస్తుంది.. ప్రపంచ వ్యాప్తంగా FedEx  కార్యకలాపాలను నిర్వహించేందుకు సాయపడుతుందని తెలిపారు రాజ్ సుబ్రమణ్యం.