
ఆసియా కప్ లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ లో భారత్ నిలకడగా ఆడుతుంది. కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. ప్రారంభంలోనే కీలకమైన 2 వికెట్లు కోల్పోగా.. సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ ఆచితూచి ఆడారు. అందివచ్చిన చోట బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు. 10 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ 2 వికెట్లు కోల్పోయి 79 రన్స్ చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ కీలక ఇన్నింగ్స్ ఆడుతున్నారు. రోహిత్(53), సూర్య కుమార్ యాదవ్(17) క్రీజులో ఉన్నారు. మరో 5 ఓవర్లు వీరిద్దరు ఔట్ కాకుండా ఉండే భారత్ భారీ స్కోర్ చేసేలా కనిపిస్తోంది.
Leading from the front, Captain @ImRo45 brings up a fine FIFTY off 32 deliveries ??
— BCCI (@BCCI) September 6, 2022
Live - https://t.co/JFtIjXSBXC #INDvSL #AsiaCup2022 pic.twitter.com/8ReqyqTS94