రాజ్యసభ సీటు పై అనవసర ప్రచారం

రాజ్యసభ సీటు పై అనవసర ప్రచారం

ముంబై: రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి తనకు లేదని ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీ స్పష్టం చేశారు. అదానీ కుంటుంబం నుంచి ఒకరు రాజ్యసభకు వెళ్లనున్నారని కొద్ది రోజులుగా ప్రచారం  సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలపై తాజాగా అదానీ గ్రూప్ స్పందించింది. అందులో ఎటువంటి వాస్తవం లేదని ప్రకటన విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. వైసీపీ తరఫున ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమి అదానీ కుటుంబంలో ఒకరికి రాజ్యసభ సీటు కేటాయించనున్నారనే వార్తలు విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి.

గౌతమ్ అదానీ లేదా ఆయన భార్య ప్రీతి అదానీని గానీ ఏపీ నుంచి రాజ్యసభకు పంపాలని జగన్ నిర్ణయం తీసుకున్నట్టుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. అలాగే ఇతర పార్టీలు కూడా ఆయనకు రాజ్యసభ సీటు ఆఫర్ చేస్తున్నట్లుగా పలు కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అదానీ స్పందించారు. రాజ్యసభ సీట్లు ఖాళీ అయినప్పుడల్లా తమ పేర్లు తెరపైకి తెస్తున్నారని, రాజ్యసభ సీట్ల విషయంలో తమను లాగడం దురదృష్టకరమని అదానీ వాపోయారు. తనకు గానీ, తన కుటుంబ సభ్యులకు గానీ రాజకీయలపై ఆసక్తి లేదని తేల్చి చెప్పారు.

మరిన్ని వార్తల కోసం...

కోలుకున్న పృథ్వీ షా.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్

సార్ పాస్ చేయండి.. లేకపోతే పెళ్లి చేస్తారు.. విద్యార్థుల వింత కోరికలు