కోలుకున్న పృథ్వీ షా.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్

కోలుకున్న పృథ్వీ షా.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్

టైఫాయిడ్ తో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన ఢిల్లీ క్యాపిటల్ (Delhi Capitals) ఓపెనర్ పృథ్వీ షా (Prithvi Shaw) కోలుకున్నారు. పృథ్వీ షా ఇటీవలే టైఫాయిడ్ బారిన పడిన సంగతి తెలిసిందే. దీంతో అతడు ఆసుపత్రిలో చేరాడు. తాజాగా.. కోలుకున్నట్లు.. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడని ఢిల్లీ క్యాపిటల్స్ ఆదివారం వెల్లడించింది. టైఫాయిడ్ కు చికిత్స తీసుకున్న అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడని.. జట్టు ఉంటున్న హోటల్ కు తిరిగి వచ్చాడని.. ఇప్పుడు జట్టు వైద్యుల బృందం పర్యవేక్షణలో అతడు కోలుకుంటున్నట్లు ప్రకటించింది. ఇతడి లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని.. గ్రూపు దశలో ఫైనల్ మ్యాచ్ నాటికి షా కోలుకోవచ్చని జట్టు అసిస్టెంట్ కోచ్ షేన్ వాట్సన్ తెలిపారు. 

కుడిచేతి బ్యాట్స్ మెన్ అయిన షా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతూ గత మూడు గేమ్ లకు దూరమైన సంగతి తెలిసిందే. ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఇంకా రెండు కీలకమైన గేమ్ లున్నాయి. 9 మ్యాచ్ లు ఆడిన షా.. 259 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలున్నాయి. పృథ్వీ షా జ్వరంతో దూరం కావడంతో.. ఇతని స్థానంలో మన్ దీప్ సింగ్, కేఎస్ భరత్ కు ఛాన్స్ లిచ్చారు. వీరిద్దరూ విఫలమయ్యారు. IPL 2022 సీజన్ లో ఇప్పటి వరకు 12 మ్యాచ్ లను ఆడింది ఢిల్లీ క్యాపిటల్. ఇందులో ఆరింటిలో మాత్రమే గెలిచింది. పాయింట్ల పట్టికలో జట్టు ఐదో స్థానంలో ఉంది. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే.. మిగిలిన రెండు మ్యాచ్ ల్లో తప్పక గెలవాల్సి ఉంటుంది. 13వ మ్యాచ్ లో పృథ్వీ షా ఆడే సూచనలు కనిపిస్తున్నాయి. 

 

మరిన్ని వార్తల కోసం :

రోడ్డు ప్రమాదంలో ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ మృతి

మూడు స్థానాల కోసం ఏడు టీంలు పోటీ