చిల్లర రాజకీయాలొద్దు.. దీదీకి షా వార్నింగ్

చిల్లర రాజకీయాలొద్దు.. దీదీకి షా వార్నింగ్

కోల్‌‌కతా: చిల్లర రాజకీయాలకు స్వస్తి చెప్పాలని తృణమూల్ కాంగ్రెస్‌ అధినేత్రికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచించారు. బెంగాల్‌‌ పర్యటనలో భాగంగా స్వాతంత్ర్య సమరయోధులు ఖుదిరామ్ బోస్, రాంప్రసాద్ బిస్మిల్‌‌కు షా నివాళులు అర్పించారు. బోస్‌‌లాగా దేశం కోసం ప్రాణాలు అర్పించే అవకాశం దేశ యువతకు దక్కకపోవచ్చునని, కానీ ఆయన ధైర్య, సాహసాలను ఫాలో అవ్వొచ్చునన్నారు.

‘చిల్లర రాజకీయాలు చేసే వారికి ఒకటే గుర్తు చేస్తున్నా.. ఖుదీరాం బోస్ లాంటి యోధులను బెంగాల్‌‌కే పరిమితం చేయొద్దు. ఆయన ఈ దేశ సంపద. పండిట్ రాంప్రసాద్ బిస్మిల్‌‌నూ అలాగే చూడాలి. యూపీతోపాటు బెంగాల్‌‌కూ, మొత్తం దేశానికీ బిస్మిల్ అంటే గర్వ కారణమే. ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ నిస్సార రాజకీయాలను ఊహించలేదు’ అని అమిత్ షా పేర్కొన్నారు. బీజేపీని అవతలి పార్టీగా తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ పేర్కొన్న నేపథ్యంలో షా పైవ్యాఖ్యలు చేయడం గమనార్హం.