కెమెరా వదిలి.. కొవిడ్ వార్డుల్ని క్లీన్ చేస్తున్నడు

V6 Velugu Posted on Aug 19, 2020

కరోనా ఎలా సోకుతుందో.. ఎవరి నుంచి ఎలా అంటుకుంటుందో ఒక క్లారిటీ అంటూ లేకుండా పోయింది. అయినా కూడా వైరస్ తో పోరులో ముందుంటున్నారు కరోనా వారియర్స్. వైరస్ భయంతో అయినవాళ్లే దూరంగా ఉంటున్న టైంలో.. సేవలు చేస్తున్నారు. అలాంటి సాహసంతో రియల్ హీరో అనిపించుకున్నాడు హస్సన్ అక్కద్ . ఒక ఫిల్మ్ మేకర్ అయ ఉండి కూడా.. కరోనా వార్డుల్లో చెత్తను క్లీన్ చేస్తూ ‘శెభాష్’ అనిపించుకుంటున్నాడు. ఎందుకని అడిగితే మనిషి విలువేంటో తనకి బాగా తెలుసని అంటాడతను.

‘‘మానవత్వం ఇంకా బతికే ఉందని నేను నమ్ముతా. ఎందుకంటే అది కళ్లారా నేను చూశా కాబట్టి. ఈస్ట్ లండన్లో నేనుం డే ఏరియాలో కొవిడ్ కేసులు చాలా వచ్చాయి. ఒకరికి ఒకరు పరిచయం లేకపోయినా సాయం చేసేందుకు వందల మంది ముందుకొస్తున్నారు. కొవిడ్ పేషెంట్ల నుంచి ప్రిస్క్రిప్షన్లు తీసుకెళ్లి మందులు తెచ్చిస్తున్నారు.. ఫుడ్ పార్శిల్స్ అందిస్తున్నారు. వాళ్లను చూశాకే సాయం చేయాలని నాకూ అనిపించింది అందుకే కొవిడ్ వార్డులో క్లీనర్‌‌‌‌‌‌‌‌గా పని చేస్తున్నా”అంటున్నాడు హస్సన్ అక్కద్ .

దారి పొడవునా..

హస్సన్ అక్కద్ .. సిరియాలో ఒక ఫిల్మ్ మేకర్. నాలుగేండ్ల క్రితం సిరియా అంతర్యుద్ధంలో నలిగిపోయి అతను నరకం చూశాడు. సైన్యం అతన్ని అరెస్ట్ చేసి.. దా రుణంగా హింసించింది. ప్రాణాలు పోతున్న టైంలో తెలివిగా అక్కడి నుంచి తప్పించుకుని యూకేకి చేరుకున్నాడు. ఆదారిలో చాలా దేశాలు దాటాడు. దారి పొడవునా ఎంతోమంది సా యం చేశారు. మనిషిలో ఉండే ఆ సాయ గుణాన్ని మరిచిపోకూడదని ఫిక్స్ అయ్యాడు హస్సన్. అంతేకాదు తన అడ్వెంచర్ జర్నీని ఒక డాక్యుమెంటరీగా కూడా తీశాడతను. అందుకుగానూ హస్సన్ అక్కద్ కి బాఫ్తా(BAFTA) అవార్డు కూడా దక్కింది. ఈ నాలుగేళ్లలో యూకే శరణార్థిగా ఉంటూ.. బోలెడన్ని సి నిమాలు, షా ర్ట్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీగా తీశాడు. అవి అతనికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టా యి. కొవిడ్ టైంలో సర్వీసులందిస్తున్న వారియర్స్ కి ధైర్యం చెబుతూ బోలెడన్ని వీడియోస్ అప్‌లోడ్ చేశాడు. అది గమనించిన యూకే గవర్నమెంట్.. అతనికి అవార్డు ఇచ్చి సత్కరించాలని అనుకుంది. కానీ, హస్సన్ మాత్రం ఆ ఆవార్డు వద్దనుకుని.. సింపుల్ గా ఓ ఆస్పత్రిలో క్లీనర్ గా చేరాడు.

హెల్త్ వర్కర్ గా..

రెండు నెలల క్రితం ఎన్ హెచ్ ఎస్ లో హెల్త్ వర్కర్‌‌‌‌‌‌‌‌గా చేరాడు హస్సన్ . అక్కడ అల్బర్ట్ ఆయనకి ట్రైనింగ్ ఇచ్చాడు. రోజూ పొద్దునే వెళ్లి కొవిడ్ పేషెంట్లను పలకరించడం, వార్డుల్ని క్లీన్ చేయడం, పేషెంట్స్ దుప్పట్లను మార్చడం, చెత్తను బయట పడేయడం.. ఇలా 12 గంటలు డ్యూటీ చేస్తున్నాడాయన. ఇలా చేస్తూ చాలామంది కొవిడ్ పేషెంట్లతో ఆయనకి ఫ్రెండ్ షిప్ మొదలైంది. ఈ డ్యూటీలో చీఫ్ నర్స్ పర్లిటా ఈయనకి ఒక ఇన్ స్పిరేషన్‌‌‌‌గా నిలిచిందట. అదెలాగో ఒక ఇన్సిడెంట్ ను ఎగ్జాంపుల్‌‌‌‌గా చెప్తాడాయన. ‘‘ఒకరోజు వార్డులో తక్కువ మంది స్టాఫ్ ఉన్నారు. పర్లిటా 30 ఏండ్లుగా ఈ హాస్పిటల్ లో నర్సుగా పని చేస్తోంది. వెంటనే ఆమె ఆలోచించకుండా ఇరవై ఏండ్ల తన కొడుక్కి కాల్ చేసింది. ఆ కుర్రాడు అదే హాస్పిటల్ కాలేజీలో నర్సింగ్ కోర్స్ చేస్తున్నాడు. ఆ క్షణం ఆమె తన కన్నకొడుకుపై మమకారాన్ని పక్కన పెట్టిం ది. ఇతరులకు ఎలాగైనా సాయం చేయాలనే ఆలోచనతో ముందుకెళ్లింది. ఇరవై నిమిషాలపాటు ఏం చేయాలో తన కొడుక్కి  ట్రైనింగ్ ఇచ్చింది. ఆ సాయం చిన్నదే అనిపించొచ్చు. కానీ, రిస్క్ తో కూడిన పనికి తన ఒక్కగానొక్క కొడుకు ప్రాణాల్ని పణంగా పెట్టడం నన్ను ఆశ్చర్యపరిచింది. ‘ఎందుకలా చేశార’ని ఆమెని అడిగా. ‘‘ఒకరి గురించి ఆలోచిస్తే.. అది ప్రేమ. అదే వంద మంది గురించి ఆలోచిస్తే.. అది సాయం. ఇలాంటి టైంలో మనిషికి మనిషే సాయం’ అని చెప్పిందామె . ఆ మాటలు నాకు జీవితాంతం గుర్తిండిపోతాయి’’ అని చెప్పా డు హస్సన్.

కరోనా క్రైసిస్ .. దగ్గరి వాళ్లను దూరం చేసింది. అయితేనేం ఏ మాత్రం సంబంధం లేనివాళ్లను ‘మానవత్వం’ రూపంలో దగ్గర చేస్తోందని అంటాడు హస్సన్ అక్కద్. ఇవ్వాళ ‘వరల్డ్ హ్యుమానిటేరియన్ డే’. అందులో భాగంగా #RealLifeHeroes క్యాంపెయిన్ నడుస్తోంది. అందులో భాగంగా యునైటెడ్ నేషన్స్ తరపున ఈయన ప్రసగించబోతున్నాడు. సిరియా నుంచి యూకే చేరుకున్న టైంలో తనకు దక్కిన సాయం గురిం చి.. మనిషిలోని ‘మంచి’, ‘సాయం చేసే గుణం’ గురిం చి తన అనుభవాల ద్వారా ప్రపంచానికి తెలియ జేయబోతున్నాడు. ‘‘మనిషి మనిషికి సాయం. ఆ సాయం లేకపోతే మనిషి మనుగడే కష్టం. నాలాంటి రియల్ హీరోలు చాలామందే ఉన్నారు. వాళ్ల గురించి మాట్లాడటానికి దొరికిన ఒక అవకాశంగా దీనిని భావిస్తున్నా’’ అని హ్యాపీగా ఫీలవుతున్నాడు హస్సన్ అక్కద్.

Tagged life, corona, HELP, patients, covid, duty, cleaning, camera, leaving, saving, akkad, cleaning. covid wards, hassan, hassan akkad, real life hero, real meaning, siriya, surving

Latest Videos

Subscribe Now

More News