
హైదరాబాద్: హైదరాబాద్‌లో జరుగుతున్న XI తెలంగాణ రాష్ట్ర షూటింగ్ చాంపియన్‌షిప్‌లో యువ క్రీడాకారులు సత్తా చాటారు. లీషా కిరణ్ ఏడు స్వర్ణ పతకాలు సాధించింది. నాగ సాయి తరుణ్ పచారపల్లి నాలుగు గోల్డ్ మెడల్స్‌తో సహా ఐదు పతకాలు గెలిచాడు. లీషా.. విమెన్స్ 10 మీ. పిస్టల్, 25 మీ. స్పోర్ట్స్ పిస్టల్ ఈవెంట్లలోని అన్ని కేటగిరీల్లో (సబ్ యూత్, యూత్, జూనియర్, విమెన్) క్లీన్‌స్వీప్ చేసింది.
మెన్స్ 25 మీ.పిస్టల్ ఈవెంట్లలో నాగసాయి పతకాలు నెగ్గాడు. సూర్య కృష్ణ చిత్తూరు రెండు స్వర్ణాలు, రెండు రజతాలు, ఒక కాంస్యంతో కలిపి ఐదు పతకాలు గెలిచాడు. సంగెం తాన్సీ6 రజతాలు, ఒక కాంస్యంతో మొత్తం ఏడు మెడల్స్‌ను సొంతం చేసుకుంది. మేకా జై గురు సింహ ప్రతాప్ అప్పారావు.. ట్రాప్, డబుల్ ట్రాప్ యూత్ మెన్ కేటగిరీలో రెండు బంగారు పతకాలు కైవసం చేసుకున్నాడు.