ఒకే స్టూడియోలో రజినీకాంత్, కమల్ హాసన్ మూవీ

ఒకే స్టూడియోలో రజినీకాంత్, కమల్ హాసన్ మూవీ

ఇండియన్ సినిమా మెచ్చిన లెజెండరీ యాక్టర్స్ రజినీకాంత్, కమల్ హాసన్. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ కూడా. ప్రస్తుతం వీళ్లిద్దరూ ఒకే స్టూడియోలో తమ సినిమాల షూటింగ్స్‌‌‌‌తో బిజీగా ఉన్నారు. కమల్‌‌‌‌తో శంకర్ తీస్తున్న ‘ఇండియన్2’ మూవీ షూటింగ్, రజినీకాంత్ హీరోగా టి.జె.జ్ఞానవేల్‌‌‌‌ తెరకెక్కిస్తున్న చిత్రం షూటింగ్ చెన్నైలో ఒకే స్టూడియోలో జరుగుతున్నాయి. 

రెండు చిత్రాలనూ లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇద్దరం ఒకే చోట ఉన్నామని తెలుసుకుని, ఒకరినొకరు కలుసుకుని గత స్మృతులను గుర్తుచేసుకున్నారు కమల్, రజినీ. గతంలో బాబా, పంచతంత్రం చిత్రాల షూటింగ్‌‌‌‌ సమయంలో వీళ్లిదరూ ఇలా ఒకే స్టూడియోలో కలుసుకున్నారు. దాదాపు 21 ఏళ్ల తర్వాత మళ్లీ ఇలా జరిగింది.