పూజల్లో నిమ్మకాయలను ఎందుకు వాడతారో తెలుసా..

పూజల్లో నిమ్మకాయలను ఎందుకు వాడతారో తెలుసా..

బైక్ కొన్నా.. కారు కొన్నా.. కొత్తగా ఇల్లు కట్టినా .. పూజల్లో నిమ్మకాయల (lemons Hinduism) వినియోగం మస్ట్ !! నిమ్మకాయలు ప్రతికూల శక్తులను దూరంగా ఉంచుతాయని విశ్వసిస్తారు. అందుకే వాటిని ఆయా సందర్భాల్లో విరివిగా వినియోగిస్తారు. నిమ్మకాయలో (lemons Hinduism) ప్రతికూల శక్తులు, చెడు కళ్ల ప్రభావాన్ని తగ్గించే శక్తి ఉంటుందని అంటారు. దేవాలయాలలో పూజలు చేసేటప్పుడు నిమ్మకాయలను ఉంచి .. వాటిని ఇంటికి తీసుకొస్తే నెగెటివ్ పవర్స్ దూరం అవుతాయని అంటారు. ఇంతకీ మన సంస్కృతిలో నిమ్మకాయలకు ఎందుకు ప్రత్యేక స్థానం ఉంది ? అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం..

నింబాసురుడి కథ ఇంట్రెస్టింగ్..

యుగయుగాలుగా నిమ్మకాయలను ఆయుర్వేద మందుల్లో, ఇంటి చిట్కాల్లో, రోజువారీ వంటలలో వినియోగిస్తుంటారు. నిమ్మ ప్రస్తావన పురాణాల పుస్తకాలలో కూడా ఉంది . నిమ్మకాయ చరిత్ర వేద యుగం నాటిది. నింబాసురుడు అనే రాక్షసుడు శివుడు, బ్రహ్మదేవుడి నుంచి వరాలు పొంది శక్తివంతుడు అయ్యాడు. ప్రజలను వేధించాడు. అతడి క్రూరమైన పనులతో కలత చెందిన ఋషి అగస్త్యుడు.. భూమిని ఆ రాక్షసుడి నుంచి రక్షించడానికి గొప్ప తపస్సు చేశాడు. నింబాసురుడిని అంతం చేయమని దుర్గా మాతను ప్రార్థించాడు. అందుకు అంగీకరించిన అమ్మవారు.. నింబాసురుడిని సంహరించి భూమిని సస్యశ్యామలం చేశారు. అందుకే అమ్మవారిని శాఖంబరీ దేవి రూపంలోనూ పూజిస్తారు.

హిందూ సంస్కృతిలో నిమ్మకాయ ఎలా భాగమైంది?

దుర్గా మాత చేతిలో మరణానికి ముందు నింబాసురుడు తన తప్పులను గ్రహించి.. శాఖంబరీ దేవి యొక్క దివ్యశక్తిని చూసి, తన పవిత్ర పాదాలలో స్థానం కల్పించమని ఆమెను వేడుకున్నాడు. దీంతో అమ్మవారు నింబాసురుడికి ఒక వరం ఇచ్చారు.అతను ఎల్లప్పుడూ నిమ్మకాయ రూపంలో ఆరాధించబడతాడని ప్రకటించింది. అప్పటి నుంచి నిమ్మకాయ హిందూ ఆచారాలలో నిమ్మకాయ ముఖ్యమైన భాగంగా మారిందని అంటారు. చండీమాత, కాళీమాత పూజల్లో తప్పనిసరిగా నిమ్మకాయలు(lemons Hinduism) సమర్పిస్తారు. ఎందుకంటే దాన్ని సమర్పించడం వల్ల అమ్మవార్ల తీవ్రమైన కోపం తగ్గుతుందని భక్తులు విశ్వసిస్తారు.

గుడిలో అమ్మవార్లకు భక్తులు నిమ్మకాయ దండలు వేస్తారు. అమ్మవారికి 108 నిమ్మకాయల మాల చాలా ప్రీతి.. దుర్గాదేవికి రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు పెట్టడం వల్ల అనేక అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. నిమ్మకాయల దీపం… అంటే పార్వతి దేవికి ప్రీతి.. నిమ్మకాయల మాల, నిమ్మకాయల దీపం పెట్టుకోవడం వల్ల అమ్మవారి అనుగ్రహం తప్పక కలుగుతుందని చెబుతున్నారు.  మీరు ప్రతినిత్యం పూజ చేసే విధంగా పూజ చేసి ఆ తర్వాత ఒక నిమ్మకాయ తీసుకుని మీ ఇంట్లో దుర్గాదేవి (ఫొటో లేదా విగ్రహం)ని పూలతో అలంకరించి నిమ్మకాయ పెట్టి కుంకుమతో అర్చన చేయాలంటున్నారు పూజారులు.

అదే సమయంలో 108 సార్లు ‘ఓం దుర్గాయై నమః’ అనే ఈ నామంతో పూజ చేసి పండ్లు నైవేద్యం పెట్టాలి. మీ సంకల్పాన్ని మనసులో అమ్మవారికి చెప్పుకుని నమ్మకంతో పూజ చేసుకోవాలి. ఆ తర్వాత నిమ్మకాయకు ఎర్ర దారం లేదా పసుపు పచ్చ దారాన్ని 3 లేదా 9 రౌండ్లు చుట్టి ముడి వేయాలి. అలా చేయడం వల్ల బంధనం ఏర్పడుతుందట. తద్వారా పూజ చేసినవారికి అమ్మవారి శక్తి లభిస్తుందని భక్తులు నమ్ముతుంటారు. ఇలా పూజ చేసిన ఆ నిమ్మకాయను మీ జేబులో పెట్టుకోవడం లేదా వ్యాపార స్థలాల దగ్గర షాపుకి కట్టుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో లేదా షాపులో నెగటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది.

నరదిష్టికి నాపరాయి పగులుతుంది అంటారు. పూజ  చేసిన నిమ్మకాయి మన ఇంటి గుమ్మానికి కడితే  అలాంటి నరదిష్టి, దిష్టి దోషం, మనపై ఏడ్చే వారి దిష్టి ఉండదు. ప్రతికూల శక్తి ప్రభావం మనపై పడదు. ప్రతి శుక్రవారం రాహుకాలంలో ఈ నిమ్మకాయ రెమిడీ చేస్తే అద్భుతమైన ఫలితం ఉంటుంది. (రాహుకాలం 10:30 నుంచి 12 గంటలు) మధ్యలో అలా వారానికి ఒకసారి నిమ్మకాయని మారుస్తూ ఉండండి. అనుకున్న పనులు అవ్వట్లేదు అనుకునేవాళ్లు రెండు నిమ్మకాయలతో రెమిడి చేసి చూడండి. ఆ తర్వాత వచ్చే అద్భుతమైన ఫలితాలను మీరు ఊహించలేరని పండితులు చెబుతున్నారు.

పూజకు వాడిన నిమ్మకాయలు ఏం చేయాలి ?

ఇంటిలో పూజకు వాడిన నిమ్మకాయలు పారవెయ్యవద్దు.. ప్రసాదంలా వాడుకోవాలి. అంటే అవి మనకు ఎలా ఉపయోగపడుతాయో అలా వాడాలి. రసం తీసిన తొక్కలను మొక్కలకు ఎరువు గా వేసుకోవచ్చు. నిమ్మ తొక్కలను ఎండబెట్టి పౌడర్ చేసి ముఖానికి సున్నిపిండిలా వాడుకోవచ్చు . టెంపుల్స్ లో పూజలకు ఉపయోగించే నిమ్మకాయలను వేలం వేస్తారు. ముఖ్యం గా తమిళనాడు లోని విల్లుపురం లో ప్రతి యేటా వేలం వేస్తారు. విల్లుపురం లో పంగుని ఉతిరం ఉత్సవాలు 11 రోజులు చేస్తారు.ఈ ఉత్సవాల్లో పూజకు ఉపయోగించే నిమ్మకాయలను కొనుక్కోవటానికి ప్రజలు పోటీ పడతారు అంటే చూడండి ఎంతటి విశిష్టత ఉన్నదో.

ALSO READ : ఒకప్పుడు తాజ్ హోటల్ వెయిటర్.. నేడు స్టార్ యాక్టర్!