న్యూఢిల్లీ: కళ్లద్దాలు అమ్మే లెన్స్‌కార్ట్ ఈ నెల 31న ఐపీఓను ప్రారంభించనుంది. ఫ్రెష్ షేర్ల ఇష్యూ ద్వారా ద్వారా రూ.2,150 కోట్లు సేకరించాలని చూస్తోంది. నవంబర్ 4న ఐపీఓ ముగియనుండగా, అక్టోబర్ 30న యాంకర్ ఇన్వెస్టర్ల బిడ్డింగ్ ప్రారంభమవుతుంది.
నవంబర్ 10న స్టాక్ ఎక్స్చేంజ్‌లో లిస్టింగ్ జరగనుంది. ఈ ఐపీఓలో ప్రమోటర్లు, షేర్‌హోల్డర్లు కలిపి 12.75 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) ద్వారా విక్రయించనున్నారు.
ఫ్రెష్ షేర్ల అమ్మకం ద్వారా వచ్చిన నిధులను కొత్త స్టోర్లు, లీజు, రెంట్, టెక్నాలజీ, బ్రాండ్ ప్రమోషన్, ఇతర స్ట్రాటజిక్ అవసరాలకు వినియోస్తామని కంపెనీ పేర్కొంది. డీమార్ట్ ఫౌండర్ రాధాకిషన్ దమానీ ఇటీవల రూ.90 కోట్ల ప్రీ-ఐపీఓ పెట్టుబడి పెట్టిన విషయం తెలిసిందే. లెన్స్‌కార్ట్ ఇండియాలో 2 వేల ఫిజికల్ స్టోర్లను ఆపరేట్ చేస్తోంది.
