V6 News

కనకగిరి అడవిలోని పులిగుండాలలో చిరుతలు

కనకగిరి అడవిలోని పులిగుండాలలో చిరుతలు
  • కెమెరాలో రికార్డు అయిన జింకను చంపి తింటున్న దృశ్యాలు

పెనుబల్లి, వెలుగు : ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కనకగిరి అడవిలోని పులిగుండాల ఎకో టూరిజం ప్రాంతంలో చిరుతలు సంచరిస్తున్న విషయం వెలుగుచూసింది. చిరుతలు, కూనలు జింకను వేటాడి మాంసాన్ని తినే దృశ్యాలు కెమెరాలో రికార్డు అయ్యాయి. 

వేటాడే జంతువులు, ఎరగా మారే జంతువులు రెండూ ఒకే ప్రాంతంలో ఉండడం పులిగుండాల అటవీ ప్రాంతంలోని జీవ వైవిధ్యానికి, ఆరోగ్యకర సమతుల్యానికి నిదర్శనం అని ఫారెస్ట్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు చెబుతున్నారు. అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల రక్షణతో పాటు వాటి నీటి అవసరాలను తీర్చేందుకు ప్రత్యేకంగా శ్రద్ధ చూపుతున్నామని తెలిపారు.