చిరుతపులిపై కొండముచ్చుల తిరుగుబాటు..ఏదో అనుకుంటే ఇంకేదో అయింది..

చిరుతపులిపై కొండముచ్చుల తిరుగుబాటు..ఏదో అనుకుంటే ఇంకేదో అయింది..

వంద గొడ్లను తిన్న ఓ రాబంధు..ఒక్క గాలివానకు కూలినట్లు..చిన్న  జంతువుల నుంచి భారీ జిరాఫీలను గజ గజ వణికిస్తూ వేటాడే చిరుత..కొండముచ్చుల దాడికి తోక ముడిచింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. 

1 నిమిషం 28 సెకన్ల వీడియోలో నిర్మానుశ్యమైన అటవీ ప్రాంతంలోని రోడ్డుపై ఓ చిరుత పులి ఆహారం కోసం వెతకసాగింది. కొద్దిదూరం వెళ్లాక ఆ చిరుతకు కొండముచ్చుల గుంపు కనిపించింది. అప్పటికే విపరీతమైన ఆకలిమీదున్న చిరుత..కొండముచ్చుల గుంపును చూడగానే..అబ్బ ఇవాళ పండగే అనుకుంది. వెంటనే కొండముచ్చులపై దాడి చేయడానికి పరిగెత్తింది. చిరుతను చూసిన కొండముచ్చులు ముందు భయపడి పారిపోయే ప్రయత్నం చేశాయి. అయితే వాటిల్లో ఓ భారీ కొండముచ్చు తిరగబడింది. చిరుతపై దాడి చేసింది. దీంతో మిగతావి కూడా చిరుతపులిపై దాడి చేశాయి. ఎక్కడికక్కడ గోళ్లతో చిరుతను రక్కేశాయి. కొండముచ్చులు దాడి చేయడంతో చిరుత భయపడింది. చివరకు బతుకు జీవుడా అంటూ  కొండముచ్చుల బారి నుంచి తప్పించుకుని చిరుత పరుగులు పెట్టింది. ఈ దృశ్యాలను ఓ వాహనదారుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. 

ఆగస్టు 15వ తేదీన సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసిన వీడియోను లక్షల జనం వీక్షించారు. వేల సంఖ్యలో లైక్ చేశారు.