కర్ణాటకలో చిరుతపులి దాడి..ముగ్గురికి గాయాలు

కర్ణాటకలో చిరుతపులి దాడి..ముగ్గురికి గాయాలు

కర్ణాటకలోని మైసూర్ లో ఓ చిరుతపులి హల్ చల్ చేసింది. కనక నగర్ లోని ఓ ఇంట్లోకి ప్రవేశించడంతో జనం భయంతో వణికిపోయారు. దీంతో ఫారస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే అక్కడికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు... చిరుత పులిని బందించడానికి ప్రయత్నించారు. దీంతో ఇంట్లో నుంచి గోడ దూకి బయటకు పరుగులు పెట్టింది. అదే టైంలో రోడ్డుపై నుంచి బైక్ పై వెళ్తున్న వ్యక్తిని ఎటాక్ చేసింది. అంతటితో ఆగకుండా చిరుతను బందించేందుకు వచ్చిన ఫారెస్ట్ అధికారిపై దాడికి యత్నించింది. చిరుత మెరుపువేగంతో దాడి చేసిన దృశ్యాలను చూసి ప్రజలు షాక్ కు గురయ్యారు. ఎంతో శ్రమించి అటవీ అధికారులు చిరుతను బంధించి. జూకి తరలించారు. 

జనంతో రద్దీగా ఉండే ప్రాంతంలోకి చిరుత ఎలా ప్రవేశించింది అనేది తెలియాల్సి ఉంది.ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద  చిరుత పరుగులు పెడుతూ ప్రజలపై ఎలా దాడి చేసిందో అనే భయంకరమైన దృశ్యాలను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. చిరుతపులి దాడిలో ముగ్గురికి గాయాలయ్యాయి. వారికి మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. చిరుతపులి దాడికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.