మాల్ లో చిరుత.. ముంబై శివారులో స్థానికుల హడల్

మాల్ లో చిరుత.. ముంబై శివారులో స్థానికుల హడల్

చిరుత అడవుల్లో ఉంటేనే మనం సేఫ్. అది జనంలోకి వచ్చిందా… అంతే సంగతులు. ఈ తెల్లవారుజామున ముంబై శివారులోని థానే నగరంలో ఓ చిరుత హల్చల్ చేసింది. పొద్దుపొద్దున్నే… స్థానిక కోరమ్ మాల్ లోని పార్కింగ్ ఏరియాలో చిరుత అటూ ఇటూ తిరగడాన్ని జనం చూశారు. పోలీసులకు చెప్పారు. ఫారెస్ట్ సిబ్బందితో కలిసి పోలీసులు వచ్చేసరికి.. చిరుత మాయం అయింది. అక్కడి కాంపౌండ్ నుంచి పక్కకు దూకిందేమో అనుకుని ఓ మూడు గంటలు వెతికారు. ప్చ్… లాభం లేదు. అది కనిపించలేదు.

ఇంకా జనం ఆఫీస్ లకు బయల్దేరకముందే.. పోలీసులు అలర్టయ్యారు. కోరమ్ మాల్ చుట్టుపక్కల పోలీసులు పెద్దసంఖ్యలో మోహరించి… కార్డన్ సర్చ్ చేసినంత పనిచేశారు. అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి అలర్ట్ చేశారు. పోఖ్రాన్ రోడ్డులోని హోటల్ సత్కార్ రెసిడెన్సీ సిబ్బంది.. సెల్లార్ లో చిరుత తిరుగుతుండటం చూసి పోలీసులకు చెప్పారు. సీసీ ఫుటేజ్ లో చిరుత కనపడేసరికి… అక్కడికి అటవీ శాఖ సిబ్బంది చేరుకున్నారు. దాని బాడీలోకి దూరంనుంచి.. గన్ సాయంతో.. మత్తుమందు ఇంజెక్షన్ ను ఇచ్చారు. మత్తులో ఉండగానే.. చిరుతపులిని బంధించి .. సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ కు తీసుకెళ్లారు.

చిరుత సమాచారం అందిన తర్వాత.. ఆరు గంటల పాటు పోలీసులు దాన్ని వెతికారు. పులిని సేఫ్ గా తీసుకెళ్లడంతో జనం హమ్మయ్య అనుకున్నారు.