జోగులాంబ ఆలయంలో.. నవరాత్రి ఉత్సవాలు షురూ

జోగులాంబ ఆలయంలో.. నవరాత్రి ఉత్సవాలు షురూ

అలంపూర్, వెలుగు: జోగులాంబ, బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయాల్లో సోమవారం దసరా శరన్నవరాత్రులు వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామివారి ఆనతి స్వీకరణ, యాగశాల ప్రవేశం, గణపతి పూజ, పుణ్యహవాచనం, రుత్విక్  వర్ణం, మహాకలశ స్థాపన, అగ్ని ముఖం నిర్వహించారు. సాయంత్రం అంకురార్పణ, ధ్వజారోహణం కార్యక్రమాలను ఎమ్మెల్యే విజయుడు ప్రారంభించారు. 

ఈవో దీప్తి, ఆలయ కమిటీ చైర్మన్  నాగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సాయంకాలం నిర్వహించిన దర్బార్​ సేవలో అమ్మవారికి నవదుర్గ అలంకారంతో కొలువు పూజ నిర్వహించి, కుమారి, సుహాసిని పూజలు జరిపించారు. మొదటి రోజు జోగులాంబ అమ్మవారు శైలపుత్రి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అమ్మవారి ఆలయాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు