సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నాం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నాం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

గొల్లపల్లి, వెలుగు: గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నట్లు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. సోమవారం జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాసంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. 

ఈ సందర్భంగా గొల్లపల్లి మండల కేంద్రంలో రూ.20 లక్షలతో సీసీ రోడ్డు పనులకు, రూ.10 లక్షలతో నిర్మించనున్న ఎస్సీ కాలనీలో ఫంక్షన్ హాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రూ.10 లక్షల శ్మశానవాటికకు నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. దీంతోపాటు దమ్మన్నపేటలో అంగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాడీ బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆత్మకూరులో ఎస్సీ కమ్యూనిటీ హాల్, భీరయ్యగుడికి రహదారి పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నిశాంత్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ సంతోష్,  వైస్ చైర్మన్ రాజిరెడ్డి, తహసీల్దార్ మజీద్ మహమ్మద్ అబ్దుల్, ఎంపీడీవో రాంరెడ్డి పాల్గొన్నారు.