ధోనీ ఇంటర్నేషనల్ స్కూల్ లో పులి.. చక్కగా ఆడుకుంటోంది..

ధోనీ ఇంటర్నేషనల్ స్కూల్ లో పులి.. చక్కగా ఆడుకుంటోంది..

బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లోని ఎంఎస్ ధోని ఇంటర్నేషనల్ స్కూల్ సమీపంలో అక్టోబర్ 29న ఓ చిరుతపులి కనిపించడంతో నివాసితులు ఇంట్లోనే ఉండాలని సూచించారు. వారి పిల్లలకు అన్ని భద్రతా జాగ్రత్తలు తీసుకోవాలని అభ్యర్థిస్తూ తల్లిదండ్రులకు పాఠశాల మెయిల్ పంపింది.

"సింగసంద్ర పరిసర ప్రాంతాల్లో చిరుతపులి కనిపించినట్లు మా దృష్టికి వచ్చింది. అయితే తాజా సమాచారం ప్రకారం, అది చాలా దూరం వెళ్లి జిబి పాళ్య సమీపంలో కనిపించింది. అటవీ శాఖ.. చిరుతను పట్టుకునే పనిలో  ఉంది. మేము పాఠశాల ప్రాంగణంలో అదనపు భద్రతా చర్యలను అమలు చేశాం. మా భద్రతా బృందం అత్యంత అప్రమత్తంగా ఉంది. ఆ ప్రాంతాన్ని నిశితంగా పర్యవేక్షిస్తుంది" అని లేఖలో తెలిపారు.

అటవీశాఖ అధికారులు, పోలీసులతో కూడిన సంయుక్త విభాగం చిరుతపులి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టింది. ఈ వార్త భయాందోళనకు గురి చేయడంతో, "చిరుతపులి తిరిగి వైట్‌ఫీల్డ్‌లోకి చేరింది. చిరుతపులి సురక్షితంగా బంధించబడిందని ఆశిస్తున్నాను" అని ఓ X యూజర్ పోస్ట్ చేసారు.