త్రిషతో రేప్ సీన్ వివాదాస్పద వ్యాఖ్యలపై..స్పందించిన మన్సూర్

త్రిషతో రేప్ సీన్ వివాదాస్పద వ్యాఖ్యలపై..స్పందించిన మన్సూర్

తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ (Mansoor Ali Khan) ఇటీవల హీరోయిన్ త్రిష(Trisha)పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆయన వ్యాఖ్యలపై వివిధ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తాజాగా హీరోయిన్ త్రిషపై చేసిన వ్యాఖ్యలపై మన్సూర్ అలీఖాన్ వివరణ ఇచ్చారు. నా తోటి మహిళ నటులను నేను ఎప్పుడు గౌరవిస్తాను..నేనెప్పుడూ ఎవరితోనూ అసభ్యకరంగా ప్రవర్తించలేదు. తన మాటలను ఎవరో కావాలనే  తప్పుగా చూపించినట్టు తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. అలాగే, హీరోయిన్ త్రిష కృష్ణన్‌ను మెచ్చుకోవాలనే ఉద్దేశంతోనే తాను మాట్లాడానని..ఆవిడపై నాకెంతో గౌరవం ఉందని తెలిపారు. 

అంతేకాకుండా..లియో మూవీలో త్రిష కృష్ణన్ పాత్రను 'పర్వతాన్ని ఎత్తుకున్న హనుమాన్'తో పోల్చారు. సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకం. అందుకే ఆమెకు కాంప్లిమెంట్స్ ఇచ్చాను. 'దురదృష్టవశాత్తూ, ఆ స్టేట్‌మెంట్ మాత్రం తీసివేయబడింది. కొన్ని స్టేట్‌మెంట్‌లు మాత్రమే అక్కడ ఎడిట్ చేసి ఎవరో కావాలనే వైరల్ చేశారంటూ..అలీఖాన్ తెలిపారు.