బీజేపీ అహంకారాన్ని విచ్ఛిన్నం చేయాల్సిందే

బీజేపీ అహంకారాన్ని విచ్ఛిన్నం చేయాల్సిందే

గుజరాత్ లో ఎన్నికల సందడి స్టార్ట్ అయ్యింది. ఎలాగైనా పంజాబ్ తరహాలో ఆ రాష్ట్రంలో కూడా పాగా వేయాలని కేజ్రీవాల్ ముందుగానే వ్యూహాలు రచించారు. అందుకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. గుజరాత్ లో అధికారమే లక్ష్యంగా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందులోభాగంగానే బీజేపీని టార్గెట్ చేస్తూ విమర్శల బాణాలు సంధించారు. బీజేపీ అహంకారాన్ని అణచివేసేందుకు ఆప్ కు ఒక్క అవకాశం ఇవ్వాలని కేజ్రీవాల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గుజరాత్ లోని బరూచ్ లో  జరిగిన ఆదివాసీ సంకల్ప్ మహాసమ్మేళన్‌లో పాల్గొన్న కేజ్రీవాల్..రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ కు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని రాష్ట్ర ప్రజలను కోరారు. గుజరాత్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని..బీజేపీ అహంకారం విచ్ఛిన్నం చేయాలని..అందుకు అందరి సహకారం కావాలని కోరారు. ఒక్క అవకాశం ఇచ్చి చూడండి..తమ ప్రభుత్వం నచ్చకపోతే వచ్చేసారి ఆప్ ను తరిమేయండి అని కేజ్రీవాల్ అన్నారు. 

గుజరాత్ లో ప్రభుత్వ పాఠశాలలు చాలా అధ్వానంగా ఉన్నాయని కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకోకపోవడంతో రాష్ట్రంలో ఆరు వేలకుపైగా పాఠశాలలు మూతబడ్డాయన్నారు. మరికొన్ని శిథిలావస్థకు చేరుకున్నాయని ఆందోళన చెందారు. దీంతో లక్షలాది మంది పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఆప్ కు అధికారం అందిస్తే సమస్యలన్నీంటిని తీరుస్తామని చెప్పారు. అలాగే గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కు సవాల్ విసిరారు. పరీక్షల సమయంలో పేపర్ లీక్ లో బీజేపీ ప్రపంచరికార్డు సృష్ట్తోందని..పేపర్ లేక్ లేకుండా ఒక్క పరీక్ష నిర్వహించలేకపోతున్నారన్నారు. ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాలలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. దేశరాజధాని హస్తినలో దాదాపు 4మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని చెప్పారు.

మరిన్ని వార్తల కోసం

తెలంగాణలో రాహుల్ గాంధీ రెండు రోజుల టూర్

ఓయూ నేతల పరామర్శకు వెళ్లిన జగ్గారెడ్డి అరెస్ట్