
కరీంనగర్ టౌన్,వెలుగు: తెలంగాణలోనే శాతవాహన యూనివర్సిటీని ఫస్ట్ ప్లేస్‌లో నిలిపేందుకు కృషి చేద్దామని వీసీ ఉమేశ్‌కుమార్ అన్నారు. బుధవారం యూనివర్సిటీలో మీడియాతో మాట్లాడుతూ వర్సిటీ అభివృద్ధి కోసం శాతవాహన ఎడ్యుకేషన్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ఇటీవల అమెరికాకు వెళ్లి శిక్షణ, స్కాలర్ షిప్స్, ఇంటర్నెట్ షిప్, పరిశోధన, గోల్డ్ మెడల్స్, విద్యారంగంలో మెరుగైన అవకాశాల కల్పన కోసం ఎన్నారైల నుంచి విరాళాలు సేకరించినట్లు వెల్లడించారు. నవంబర్‌లో రెండో స్నాతకోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు.
బోస్టన్ ‘మీట్ అండ్ గ్రీట్’ ద్వారా తెలంగాణ ఎన్నారై సంఘం, ఇతరుల నుంచి విరాళాలు స్వీకరించినట్లు చెప్పారు. అమెరికా పర్యటన తనలో ఆత్మస్థైర్యాన్ని నింపిందని, ఇది విద్యార్థుల పరిశోధనలకు ఉపయుక్తం కానుందన్నారు.