ధోని సినిమాకు కలెక్షన్స్ నిల్.. మరీ ఇంత దారుణంగానా?

ధోని సినిమాకు కలెక్షన్స్ నిల్.. మరీ ఇంత దారుణంగానా?

ఇండియన్ స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని(Mahendrasingh Dhoni) నిర్మాతగా మారి తెరకెక్కించిన ఫస్ట్ మూవీ LGM (Let’s Get Married). ఇవానా(Ivana), హరీష్ శంకర్(Harish shankar) జంటగా వచ్చిన ఈ సినిమాలో సీనియర్ నటి నదియా(Nadiya) కీలక పాత్ర పోషించారు. జులై 28న భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి మినిమమ్ రెస్పాన్స్ కూడా రాలేదు. 
 
ముందుగా ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయాలని ప్లాన్ చేశారు మేకర్స్. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల కేవలం తమిళనాడులోనే విడుదల చేశారు. దాదాపు 400 స్క్రీన్స్‌లో రిలీజైన ఈ మూవీ మినిమమ్ వసూళ్లను కూడా రాబట్టలేకపోయింది. అడ్వాన్స్ బుకింగ్, ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి మొదటిరోజు కేవలం రూ. 1.25 కోట్లు మాత్రమే వచ్చాయని సమాచారం. దాదాపు రూ.10 కోట్ల ప్రీ రిలీజ్ బిజనెస్ తో వచ్చిన ఈ సినిమా.. ఇంకా రూ. 9 కోట్లు కలెక్ట్ చేస్తే తప్ప బ్రేక్ ఈవెన్ అవడం సాధ్యం కాదు. 

మరి ధోని నిర్మించిన సినిమాకు ఈ కలెక్షన్సా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. నిజానికి ఈ సినిమాను ధోని పేరు మీదే ఎక్కుడ ప్రచారం చేశారు. ఈ సినిమా ఈవెంట్స్ కు వచ్చి మరీ ప్రమోట్ చేశారీ ధోని. కానీ అవేవి ప్రేక్షకులను థియేటర్స్ కు రప్పించడానికి ఉపదయోగపడలేదనే చెప్పాలి. మరి లాంగ్ రన్ లో ఈ సినిమా మినిమమ్ కలెక్షన్స్ అయినా రాబడుతుందా? లేదా డిజాస్టర్ గా నిలుస్తుందా అనేది చెప్పాలంటే ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ అవ్వాల్సిందే.