
సౌతాఫ్రికాపై మరో సంచలన క్రికెటర్ దొరికాడు. 19 ఏళ్ళ వయసులో లువాన్-డ్రే ప్రిటోరియస్ తన అరంగేట్ర టెస్టులోనే సెంచరీతో చెలరేగాడు. బులవాయో వేదికగా క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ లో జింబాబ్వేతో జరుగుతున్న తొలి టెస్టులో 112 బంతుల్లోనే తన సెంచరీ మార్క్ అందుకోవడం విశేషం. 19 ఏళ్ళ కుర్రాడి ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్ చరిత్రలో సౌతాఫ్రికా తరపున సెంచరీ చేసిన అతి చైనా వయస్కుదిగా నిలిచాడు. డేవిడ్ బెడింగ్హామ్ ఔటైన తర్వాత ఐదో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన ప్రిటోరియస్.. ఆరంభం నుంచి దూకుడుగా ఆడాడు. వన్డే రీతిలో చెలరేగిపోయాడు.
Lhuan-dre Pretorius scores his first Test century in his debut game 👊#ZIMvSA 📝: https://t.co/90VEx8npEd
— ICC (@ICC) June 28, 2025
📸: @ProteasMenCSA pic.twitter.com/LXlLE70YMD
23 పరుగులకే మూడు వికెట్లు పడినప్పటికీ తన దూకుడు కొనసాగించాడు. బంగ్లా బౌలర్లపై ఎటాకింగ్ షాట్స్ ఆడుతూ 53 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సహచరులు విఫలమవుతున్నా బ్రేవీస్ తో కలిసి 95 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. చివరిసారిగా ఒక సౌతాఫ్రికా 2016లో తన అరంగేట్ర మ్యాచ్ లో సెంచరీ చేశాడు. ప్రిటోరియస్ తన బ్యాటింగ్ తో సౌతాఫ్రికా పరువు కాపాడాడు. ప్రిటోరియస్ తో పాటు బ్రేవీస్ (51) హాఫ్ సెంచరీతో రాణించడంతో ప్రస్తుతం సౌతాఫ్రికా తొలి రోజు టీ విరామ సమయానికి 6 వికెట్ల నష్టానికి 248 పరుగుల భారీ స్కోర్ చేసింది. క్రీజ్ లో ప్రిటోరియస్ (128), కార్బిన్ బాష్ (22) ఉన్నారు.
టోనీ డి జోర్జి (0), మాథ్యూ బ్రీట్జ్కే (13), వియాన్ ముల్డర్ (17), డేవిడ్ బెడింగ్హామ్ (0), కైల్ వెర్రెయిన్నే(10) విఫలమయ్యారు. జింబాబ్వే బౌలర్లలో తనకా చివాంగా మూడు వికెట్లు పడగొట్టాడు. లువాన్-డ్రే ప్రిటోరియస్, మాథ్యూ బ్రీట్జ్కే, డెవాల్డ్ బ్రెవిస్ కు తుది జట్టులో స్థానం దక్కింది. వీరు ముగ్గురు తమ తొలి టెస్ట్ ఆడుతున్నారు. రెగ్యులర్ కెప్టెన్ బవుమా దూరం కావడంతో స్పిన్నర్ కేశవ్ మహరాజ్ సౌతాఫ్రికాకు తొలిసారి టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు చేపడుతున్నాడు. రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కోసం ప్రోటీస్ జట్టు ఏకంగా ఐదుగురు అన్క్యాప్డ్ ఆటగాళ్లను ఎంపిక చేయడం విశేషం.
This session has all been about Lhuan-dre Pretorius as the 19-year-old beats Graeme Pollock's record and becomes the youngest centurion for South Africa 🇿🇦
— ESPNcricinfo (@ESPNcricinfo) June 28, 2025
📸: @ProteasMenCSA pic.twitter.com/MoEwsqaPHc