ములుగు, వెలుగు: జిల్లాలోని గ్రంథాలయాలను వినియోగించుకోవాలని గ్రంథాలయ సంస్థ చైర్మన్బానోతు రవిచందర్ సూచించారు. గురువారం ములుగులో గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలు పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులు, కవులు, గాయకులకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. విద్యార్థులు చదువులో రాణించాలని, చదువుతోనే అన్ని వర్గాల ప్రజలు సమన్యాయం పొందుతారని చెప్పారు. కార్యక్రమంలో గ్రంథాలయ సీనియర్ అసిస్టెంట్ నిఖిల్, లైబ్రేరియన్సమ్మక్క, పాఠకులు పాల్గొన్నారు.
గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలు
జనగామ అర్బన్, వెలుగు: గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలని జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్ అన్నారు. గురువారం జనగామ పట్టణంలో నిర్వహించిన 58వ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలని, ఇందుకోసం గ్రంథాలయాలను వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి మార్కెట్ కమిటీ చైర్మన్బనుక శివరాజ్ యాదవ్‌తో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్మారజోడు రాంబాబు బహుమతులు అందజేశారు. ఆయనను కవులు, రచయితల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సన్మానించారు. సంస్థ కార్యదర్శి సుధీర్, లైబ్రేరియన్ కృష్ణ తదితరులున్నారు.
