లిబియాలో వరదలు.. 2 వేల మంది కొట్టుకుపోయారు.. ఓ నగరం మునిగింది

లిబియాలో వరదలు.. 2 వేల మంది కొట్టుకుపోయారు.. ఓ నగరం మునిగింది

లిబియా దేశం ఇప్పుడు అల్లకల్లోలం.. భారీ వర్షాలు, ఆకస్మిక వరదలకు ఓ సిటీనే మునిగిపోయింది. అక్షరాల రెండు వేల మంది కొట్టుకుపోయారు.. వాళ్లందరూ చనిపోయినట్లు చెబుతున్నారు అధికారులు. వాహనాల్లో వెళుతున్న జనం.. వాటితో సహా కొట్టుకుపోయి చనిపోవటం మరింత విషాధం. రాత్రి ఎంతో ఉల్లాసం.. సరదాగా.. విద్యుత్ వెలుగుల్లో ఉన్న సిటీ.. ఉదయానికి శ్మశానంగా మారింది. బిల్డింగ్స్ లో ఉన్న వారు సైతం కొట్టుకుపోవటం అంటే.. వరదలు ఏ స్థాయిలో బీభత్సం చేశాయో అర్థం అవుతుంది. ఇప్పుడిప్పుడే ప్రపంచానికి తెలుస్తున్న ఈ షాకింగ్ ఘటన.. అందరినీ కలిచివేస్తుంది.. పూర్తి వివరాల్లోకి వెళితే..

మధ్యధరా తుఫాను డేనియల్ లిబియాలో విధ్వంసకర వరదలకు దారితీస్తోంది. ఈ ధాటికి ఆనకట్టలు సైతం కొట్టుకుపోతున్నాయి. తూర్పు ఆఫ్రికా దేశం తీర ప్రాంతాలలో మొత్తం పొరుగు ప్రాంతాలు ఈ తుపాను దాటికి ఇప్పటికే  కొట్టుకుపోయింది. అసోసియేటెడ్ ప్రెస్ రిలీజ్ చేసిన నివేదిక ప్రకారం, దాదాపు 2వేల మంది చనిపోయారు.

లిబియాలో అత్యంత ప్రభావితమైన నగరం డెర్నా. ఇప్పటికే ఏళ్ల తరబడి అశాంతి, ఉగ్రవాదం బారి నుంచి బయటపడేందుకు ఇప్పటికే పోరాడుతున్న ఈ నగరం పరిస్తితి ఇప్పుడు ఈ వరదల కారణంగా అగమ్యగోచరంగా మారింది. ప్రభుత్వం విడుదల చేసిన డేటా ప్రకారం ఈ వర్షాల్లో మరణించిన వారి సంఖ్య 61కి చేరుకుంది. డెర్నాలో రెండు డ్యామ్‌లు పగిలిపోయి, వేలాది మంది తరలించబడ్డారని అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. ఈ వినాశనానికి సంబంధించిన పలు వీడియోలు, ఫొటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. వీటిల్లో పర్వతాల నుంచి సిటీ సెంటర్ గుండా ప్రవహించే నది వెంట మొత్తం నివాస ప్రాంతాలు తొలగిపోయి కనిపించగా.. పలు బహుళ అంతస్తుల అపార్ట్మెంట్ భవనాలు బురదలో కూలిపోయినట్లు ఉన్నాయి.

డెర్నాలో 2వేల మంది చనిపోయారని, వేలాది మంది తప్పిపోయినట్లు తూర్పు లిబియాలోని ప్రభుత్వ ప్రధాన మంత్రి ఒస్సామా హమద్ భావిస్తున్నానన్నారు. డెర్నా ఇప్పుడు డిజాస్టర్ జోన్‌గా మారిందని ఆయన అన్నారు. ప్రధాని మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించి, దేశవ్యాప్తంగా జెండాలను సగానికి అవనతం చేయాలని ఆదేశించారు.