జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌‌‌‌లో ఎల్​ఐసీకి 6.66 % వాటా

జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌‌‌‌లో ఎల్​ఐసీకి 6.66 % వాటా

న్యూఢిల్లీ: డీమెర్జ్ అయిన నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ యూనిట్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌‌‌‌లో తమకు 6.66 శాతం వాటాలు వచ్చాయని  ఎల్‌‌‌‌ఐసి  మంగళవారం తెలిపింది.  ‘రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్' ద్వారా డీమెర్జర్​ యాక్షన్​ విధానంలో 'జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్'లో 6.66 శాతం వాటాలు వచ్చాయని  రెగ్యులేటరీ ఫైలింగ్‌‌‌‌లో తెలిపింది.

 జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆగస్టు 21న స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్​అయింది. ఈ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ.1.60 లక్షల కోట్లకు చేరుకుంది.  జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు ఒక్కొక్కటి రూ. 239.20 వద్ద ట్రేడవుతున్నాయి. .