ఎల్‌‌ఐసీ నుంచి ప్రభుత్వానికి  రూ.2,610 కోట్లు

ఎల్‌‌ఐసీ నుంచి ప్రభుత్వానికి  రూ.2,610 కోట్లు

న్యూఢిల్లీ : ఎల్‌‌ఐసీ ఇండియా ఛైర్మన్‌‌ ఎంఆర్‌‌‌‌ కుమార్ రూ.2,610.74 కోట్ల విలువైన డివిడెండ్ చెక్‌‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌‌కు అందించారు. 2019 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఎల్‌‌ఐసీ ఆర్జించిన వాల్యుయేషన్‌‌ సర్‌‌‌‌ప్లస్‌‌లో ప్రభుత్వ వాటాని, నిర్మలాకి ఇచ్చారు. 2018–19 ఆర్థిక సంవత్సరంలో  రూ.53,214.41 కోట్లు వాల్యుయేషన్‌‌ సర్‌‌‌‌ప్లస్‌‌ను ఎల్‌‌ఐసీ జనరేట్ చేసింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 9.9 శాతం ఎక్కువ. ఎల్‌‌ఐసీ చరిత్రలోనే మొట్టమొదటిసారి వాల్యుయేషన్ సర్‌‌‌‌ప్లస్ రూ.50 వేల కోట్లను క్రాస్ చేసింది. నిర్మలా సీతారామన్‌‌కు డివిడెండ్ చెక్‌‌ను అందించే కార్యక్రమంలో ఫైనాన్స్ సెక్రటరీ రాజీవ్ కుమార్, ఇన్సూరెన్స్ అండ్ ఎఫ్‌‌ఐ స్పెషల్ సెక్రటరీ దెబసిస్ పాండ, ఎల్‌‌ఐసీ అధికారులు టీసీ సుశీల్ కుమార్, విపిన్ ఆనంద్, ముకేశ్ కుమార్ గుప్తా, రాజ్ కుమార్‌‌‌‌లు ఉన్నారు.