ఎల్​ఐసీ నుంచి ధనవృద్ధి పాలసీ

ఎల్​ఐసీ నుంచి ధనవృద్ధి పాలసీ

హైదరాబాద్, వెలుగు: ధన వృద్ధి పేరుతో  ఎల్​ఐసీ కొత్త బీమా పథకాన్ని ప్రారంభించింది. ఇది నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్, వ్యక్తిగత, పొదుపు, సింగిల్ ప్రీమియంతో కూడిన జీవిత బీమా ప్లాన్. ప్రొటెక్షన్​, సేవింగ్స్​.. రెండూ ఉంటాయి. పాలసీహోల్డర్​ మరణిస్తే  బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందిస్తారు.  మెచ్యూరిటీ తేదీకి జమయ్యే  మొత్తాన్ని కూడా చెల్లిస్తారు.

ఎల్​ఐసీ ధన వృద్ధి ప్లాన్ ఫీచర్లు

ఈ ప్లాన్ కింద కస్టమర్లకు 'మరణంపై హామీ మొత్తం' 1.25 రెట్లు (ఆప్షన్ 1) లేదా 10 రెట్లు (ఆప్షన్ 2) అనే రెండు ఆప్షన్లు ఇస్తారు. ఆప్షన్​ను బట్టి ట్యాబులర్ ప్రీమియంను చెల్లించాలి. కొన్ని షరతుల ప్రకారం పాలసీ ఇస్తారు. ధన వృద్ధి ప్లాన్ 10, 15 లేదా 18 సంవత్సరాల గడువుతో అందుబాటులో ఉంటుంది. టర్మ్​ను బట్టి ఎంట్రీ ఏజ్​90 రోజుల నుండి 8 సంవత్సరాల వరకు ఉంటుంది. వినియోగదారులు ఎంచుకున్న ఆప్షన్  ​ఆధారంగా ఎంట్రీ ఏజ్​ 32 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ  ప్లాన్ కింద, కనీస ప్రాథమిక హామీ మొత్తం రూ. 1,25,000.  కస్టమర్లు రూ. 5,000 చొప్పున  హామీ మొత్తాన్ని పెంచుకోవచ్చు.

ఇవీ ప్రయోజనాలు...

జీవిత బీమా పొందిన వ్యక్తి మరణించినప్పుడు గడువు తేదీకి ముందు చెల్లించాల్సిన మొత్తంతోపాటు జమ అయిన గ్యారెంటీ యాడిషన్స్​నూ చెల్లిస్తారు. మెచ్యూరిటీ తేదీ తరువాత జీవించి ఉంటే అష్యూర్డ్​ యాడిషన్స్​, ప్రాథమిక హామీ మొత్తాన్ని పొందుతారు. ప్రతి పాలసీ సంవత్సరం చివరిలో అష్యూర్డ్​ యాడిషన్స్ జమ అవుతాయి. ఇది ఆప్షన్​ 1 కింద ఇది రూ. 60 నుండి రూ. 75 వరకు ఉంటుంది.  ఎంపిక 2 కింద టర్మ్​ను బట్టి రూ. 25 నుండి రూ. 40 వరకు ఉంటుంది. ఇందులో యాక్సిడెంటల్​ డెత్​, డిజిబిలిటీ బెనిఫిట్​ రైడర్లు ఉంటాయి. మెచ్యూరిటీ/డెత్​ సమయంలో ఐదేళ్లపాటు నెలవారీ/మూడు నెలలు/అర్ధ-సంవత్సరం/వార్షిక వ్యవధిలో సెటిల్​మెంట్​ ఆప్షన్​ అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ ద్వారా లోన్ కూడా పొందవచ్చు. పాలసీ తీసుకున్నాక మూడు నెలల తర్వాత ఎప్పుడైనా అందుబాటులో ఉంటుంది.

ఎలా కొనాలి ?

ఎల్​ఐసీ ధన వృద్ధి ప్లాన్‌‌‌‌ను ఏజెంట్/ఇతర మధ్యవర్తుల ద్వారా పాయింట్ ఆఫ్ సేల్స్ పర్సనల్ లైఫ్ ఇన్సూరెన్స్  /కామన్ పబ్లిక్ సర్వీస్ సెంటర్స్ తో పాటు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో నేరుగా www.licindia.in వెబ్‌‌‌‌సైట్ ద్వారా కొనుగో లు చేయవచ్చు.  ఈ ప్లాన్ జూన్ 23, 2023 నుండి సెప్టెంబరు 30, 2023 వరకు అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. ఇది ఒకే ప్రీమియం ప్లాన్ కాబట్టి భవిష్యత్తులో ప్రీమియం బాధ్యత,  లాప్సేషన్ ఉండదు.