కొత్త జీవిత బీమా పథకాన్ని ప్రారంభించిన ఎల్ఐసీ

కొత్త జీవిత బీమా పథకాన్ని ప్రారంభించిన ఎల్ఐసీ

న్యూఢిల్లీ:  ఎల్​ఐసీ ధన వర్ష  పేరుతో కొత్త జీవిత బీమా పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం క్లోజ్-ఎండ్, నాన్ -లింక్డ్, నాన్ -పార్టిసిపేటింగ్ స్కీమ్. అంతేగాక వ్యక్తిగత, పొదుపు, సింగిల్ ప్రీమియం జీవిత బీమా ప్లాన్.  రక్షణతోపాటు  పొదుపునూ అందిస్తుంది. జీవిత బీమా పాలసీ సమయంలో పాలసీహోల్డర్​ మరణించినట్లయితే, ఈ ప్లాన్ కింద కుటుంబానికి ఇన్సూరెన్స్​ డబ్బు చెల్లిస్తారు. మెచ్యూరిటీ తేదీ వచ్చాక,  మిగిలిన ‘అష్యూర్డ్​ లైఫ్​’ కాలానికి కొంత డబ్బు ఇస్తారు  మొత్తం నాన్–-మెడికల్ లిమిటెడ్​, వయస్సు  ఎంచుకున్న హామీ మొత్తాన్ని బట్టి నాన్–-మెడికల్,  మెడికల్ స్కీమ్‌‌‌‌లకు ప్లాన్ అందుబాటులో ఉంటుంది. బేస్ ప్లాన్ కింద  ప్రయోజనాలను పరిశీలిస్తే..  మెచ్యూరిటీ అడ్వాంటేజ్ కింద.. పాలసీ హోల్డర్​ జీవిత బీమా మెచ్యూరిటీ  తేదీ  దాకా జీవించి ఉంటే, "ప్రాథమిక హామీ మొత్తం"  ఇస్తారు. అక్రూడ్​ గ్యారంటీ యాడిషన్స్​ కూడా వర్తిస్తాయి. హామీతో కూడిన యాడిషన్స్​ ప్రకారం... పాలసీ సమయం ఉన్నంతవరకు  ప్రతి పాలసీ సంవత్సరం ముగిసే సమయానికి గ్యారెంటీడ్ యాడిషన్స్ జమ అవుతాయి. బేసిక్ సమ్ అష్యూర్డ్, పాలసీ టర్మ్  ఎంచుకున్న ఆప్షన్లను బట్టి గ్యారెంటీడ్ యాడిషన్స్​ ఉంటాయి.

పాలసీ హోల్డర్​మరణించినప్పుడు, సంబంధిత పాలసీ సంవత్సరానికి హామీ ఇచ్చిన యాడిషన్స్​ను చెల్లిస్తారు. పాలసీని సరెండర్ చేసినప్పుడు అక్రూడ్​ గ్యారెంటీ యాడిషన్స్​ కూడా వర్తిస్తాయి. "సమ్ అష్యూర్డ్ ఆన్ డెత్" మొత్తం కూడా ఇస్తారు.  ప్రమాదం వల్ల శాశ్వత వైకల్యం వస్తే యాక్సిడెంట్​ బెనిఫిట్​ మొత్తాన్ని పదేళ్లపాటు చెల్లిస్తారు. ఈ పాలసీ తీసుకునేందుకు కనీస వయసు 18 ఏళ్లు. కనీసం రూ.1,25,000 కి పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. ఇది సింగిల్ ప్రీమియం పాలసీ.  ఒకేసారి డబ్బులు కట్టాల్సి ఉంటుంది. ధనవర్ష పాలసీపై లోన్ కూడా తీసుకోవచ్చు.