ఎల్ఐసీలో భారీగా ఎవరూ క్లెయిమ్​ చేయని డబ్బు

ఎల్ఐసీలో భారీగా ఎవరూ క్లెయిమ్​ చేయని డబ్బు

న్యూఢిల్లీ: ఎవరూ క్లెయిమ్​ చేయకుండా వదిలేసిన డబ్బు తమ వద్ద రూ.21,539 కోట్లు ఉందని మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి ఐపీఓ కోసం దాఖలు చేసిన డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్​లో ఎల్ఐసీ వెల్లడించింది.  గత సెప్టెంబర్ నాటి వరకు ఉన్న  డబ్బు విలువ ఇది. ఈ మొత్తంపై పొందిన వడ్డీ కూడా ఇందులో కలిసి ఉంది.  క్లెయిమ్ చేయని మొత్తం మార్చి 2021 చివరి నాటికి రూ. 18,495 కోట్లు కాగా,  మార్చి 2020 చివరి నాటికి రూ. 16,052.65 కోట్ల వరకు ఉంది. మార్చి 2019 చివరి నాటికి క్లెయిమ్ చేయని మొత్తం రూ.13,843.70 కోట్లుగా లెక్కించారు. ప్రతి బీమా సంస్థ రూ. 1,000 లేదా అంతకంటే ఎక్కువ క్లెయిమ్ చేయని మొత్తం గురించిన సమాచారాన్ని వారి సంబంధిత వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌లలో (10 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా అలాగే ఉంటే) ప్రదర్శించాల్సి ఉంటుంది  సంబంధిత పాలసీదారులు లేదా లబ్ధిదారులు అన్‌‌‌‌‌‌‌‌క్లెయిమ్ చేయని మొత్తాన్ని వెబ్‌‌‌‌‌‌‌‌సైట్ ద్వారా వెరిఫై చేసుకోవచ్చు. అంతేగాక ఈ మొత్తాన్ని సీనియర్​ సిటిజన్స్​ వెల్ఫేర్ ఫండ్​ కు బదిలీ చేయాలి.

మరిన్ని వార్తల కోసం..

జనానికి మంట.. కంపెనీలకు పంట

సారలమ్మ వచ్చె.. సంబురం తెచ్చె

మేడారం జాతర ఫోటో గ్యాలరీ