‘ఫిట్ ఇండియా ప్రీడమ్‌‌ రన్‌‌’ నిర్వహించిన ఎల్ఐసీ

‘ఫిట్ ఇండియా ప్రీడమ్‌‌ రన్‌‌’ నిర్వహించిన ఎల్ఐసీ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఈ ఏడాది ‘ఫిట్ ఇండియా ప్రీడమ్‌‌ రన్‌‌’ను సోమవారం ఎల్‌‌ఐసీ నిర్వహించింది. ఈసారి జరిగిన ఈ ఈవెంట్‌  విజిలెన్స్‌‌ అవేర్‌‌‌‌నెస్‌‌ వీక్‌‌ ప్రారంభం రోజున, రాష్ట్రీయ ఏక్తా దివస్‌‌ నాడురావడం యాదృచ్ఛికమని ఎల్‌‌ఐసీ ఓ స్టేట్‌‌మెంట్‌‌లో పేర్కొంది. వీటిని సెలబ్రేట్ చేసుకోవడానికి ఎల్‌‌ఐసీ  హైదరాబాద్ జోనల్ ఆఫీస్‌‌ సోమవారం  హెల్త్‌‌ వాక్‌‌ను నిర్వహించింది. ఈ సంస్థ ఉద్యోగులు జోనల్ ఆఫీస్  దగ్గర ప్రారంభమై తారా మండల్ కాంప్లెక్స్‌‌, సెక్రెటేరియట్‌‌, ఎన్‌‌టీఆర్ గార్డెన్స్‌‌, పీవీ నరసింహా రావు స్టాట్యూ, లుంబినీ పార్క్‌‌ను దాటుకుంటూ వాక్ చేశారు. కస్టమర్లకు మొదట ప్రాధాన్యం ఇవ్వాలని, క్రమశిక్షణతో  పనిచేయాలని ఈ సందర్భంగా ఉద్యోగులను ఉద్దేశిస్తూ జోనల్ మేనేజర్‌‌‌‌ ముక్కవల్లి జగన్నాథ్‌‌ పేర్కొన్నారు.

టెక్నాలజీ పరంగా ఎంత ముందుకెళ్లినా కస్టమర్లను దృష్టిలో పెట్టుకొని చేపట్టే పనులు  మనల్ని ముందుకు తీసుకెళతాయని అన్నారు. ఈ ఈవెంట్‌‌లో జోనల్ ఆఫీస్ డైరెక్టర్లు ఎల్‌‌కే శ్యామ్‌‌సుందర్‌‌‌‌, విద్యానంద్‌‌ ఝా, వినీత్‌‌ శ్రీవాస్తవ్‌‌, సాయినాథ్‌‌, కే మురళీదర్‌‌‌‌, రీజినల్ మేనేజర్ అయిన  కెమ్యూల్‌‌ రాజ్‌‌, జోనల్ విజిలెన్స్ ఆఫీసర్‌‌‌‌ ఎం చంద్ర శేఖర్‌‌ ‌‌ పాల్గొన్నారు. కాగా, ఇండిపెండెన్స్ డే, గాంధీ జయంతి..రెండు కీలక రోజులను దృష్టిలో పెట్టుకొని ‘ఫిట్ ఇండియా ప్రీడమ్‌‌ రన్‌‌’ ఈవెంట్‌ను 2020లో యూత్ అఫైర్స్‌‌ మినిస్టర్ స్టార్ట్ చేశారు.