ఎల్​ఐసీ షేర్లను వదిలేస్తున్న ఇన్వెస్టర్లు

ఎల్​ఐసీ షేర్లను వదిలేస్తున్న ఇన్వెస్టర్లు

న్యూఢిల్లీ: ఎల్​ఐసీ షేర్లు ఇన్వెస్టర్లను తీవ్రంగా నిరాశపర్చుతున్నాయి. రోజురోజుకూ   ధర తగ్గిపోతూనే ఉండటంతో లక్షలాది మంది వీటిని వదిలించుకుంటున్నారు. గడచిన 45 రోజుల్లో 2 లక్షల మందికి పైగా రిటైల్ ఇన్వెస్టర్లు ఎల్‌‌ఐసి స్టాక్స్​కు  దూరమయ్యారు. రిటైల్​ ఇన్వెస్టర్ల  హోల్డింగ్ మాత్రం కొద్దిగా పెరిగింది. ఈ ఏడాది మే 18న లిస్టింగ్ అయినప్పటి నుండి స్టాక్ డౌన్‌‌ట్రెండ్‌‌లోనే ఉంది.  ఐపీఓ ధరలు రూ.904 (రిటైల్ ఇన్వెస్టర్లకు),   రూ.889 (పాలసీ హోల్డర్‌‌లకు) లతో పోలిస్తే ఈ షేరు జూన్‌ 20 న  రూ.650 వద్ద కనిష్ట స్థాయికి పడిపోయింది. పోయిన క్వార్టర్​లో దాదాపు 4,000 మంది ఎన్నారైలు ఎల్​ఐసీ షేర్లు కొన్నారు.  రిటైల్ ఇన్వెస్టర్ల సంఖ్య పూర్తిగా తగ్గిపోతున్నప్పటికీ, వారి వాటా మాత్రం 1.66 % నుంచి 1.88 శాతానికి పెరిగింది. స్టాక్ ఎక్స్ఛేంజీలలో తాజా షేర్ హోల్డింగ్ విధానం (జూన్ క్వార్టర్​) ప్రకారం, 37.65 లక్షల మంది రిటైల్ ఇన్వెస్టర్ల దగ్గర 11.86 కోట్ల షేర్లు  ఉన్నాయి. మొత్తం 39.86 లక్షల మంది ఐపీఓలో పెట్టుబడి పెట్టారు. అంటే 1.66 % వాటా అమ్మడంతో 10.51 కోట్ల షేర్లు మార్కెట్లో ట్రేడయ్యాయి. ఈ క్వార్టర్​లో దాదాపు వేలాది మంది కొత్త ఎన్‌‌ఆర్‌‌ఐలు ఎల్‌‌ఐసిలోకి ప్రవేశించారు. ఎల్‌‌ఐసి షేర్లపై వీళ్లు బెట్టింగ్‌‌లు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం  21,268 మంది ఎన్నారైల దగ్గర 0.03 % వాటా ఉంది. 

తగ్గిన ఎఫ్​పీఐలు, డీఐఐలు వాటాలు
దేశీయ సంస్థలతోపాటు  విదేశీ పోర్ట్‌‌ఫోలియో పెట్టుబడిదారులు (ఎఫ్​పీఐలు) ఎల్​ఐసీ స్టాక్‌‌లో తమ హోల్డింగ్‌‌ను తగ్గించుకున్నారు. ఎఫ్‌‌పీఐల హోల్డింగ్ 0.22 శాతం నుంచి 0.12 శాతానికి తగ్గగా, ఎంఎఫ్‌‌ల వాటా 0.74 శాతానికి తగ్గింది.  ఎల్​ఐసీని దగ్గరున్న మ్యూచువల్​ ఫండ్స్​ పథకాల సంఖ్య 19 నుండి 100కి పెరిగింది.  ఎల్​ఐసీ షేర్లను కొన్న ఎఫ్​పీఐల సంఖ్య 59 నుండి 47కి తగ్గింది.   క్యూఐబీల సంఖ్య  దాదాపు 35 (గతంలో18)కి చేరింది రెట్టింపు అయింది. హోల్డింగ్  0.19 శాతానికి (గతంలో 0.20 శాతం ఉండేది) తగ్గింది. ఇటీవల ఎల్​ఐసీ మార్చి 2022 నాటికి రూ.5,41,492 కోట్ల ఎంబెడెడ్ వాల్యూను (ఈవీ) రిపోర్ట్​ చేసింది. ఇది ఆరు నెలల క్రితం ఉన్న వాల్యూ రూ.5,39,686 కోట్ల కంటే కొంచెం ఎక్కువ. ఇది 2022 ఫైనాన్షియల్​ ఇయర్​కు ‘వాల్యూ ఆఫ్​న్యూ బిజినెస్​’ (వీఎన్​బీ) విలువను రూ.7,619 కోట్లుగా ప్రకటించింది. - ఇది గత ఆర్థిక సంవత్సరం కంటే 83 శాతం ఎక్కువ. - వీఎన్​బీ మార్జిన్‌‌ 9.9 శాతం నుండి 15.1 శాతానికి పెరిగింది. రీసెర్చ్​ సంస్థ ఎంకే గ్లోబల్​ఇటీవల ఎల్​ఐసీపై రిపోర్టును విడుదల చేసింది.  షేరుకు న్యూట్రల్​ రేటింగ్​ ఇచ్చింది.