ఎల్‌‌‌‌‌‌‌‌ఐసీ ప్రాఫిట్ రూ.19,013 కోట్లు

ఎల్‌‌‌‌‌‌‌‌ఐసీ ప్రాఫిట్ రూ.19,013 కోట్లు

న్యూఢిల్లీ: ఎల్‌‌‌‌‌‌‌‌ఐసీ ఈ ఏడాది మార్చితో ముగిసిన క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో రూ.19,013 కోట్ల నికర లాభం సంపాదించింది.  గతేడాది ఇదే క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో వచ్చిన రూ.13,763 కోట్ల ప్రాఫిట్‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే  ఇది 38 శాతం ఎక్కువ. ఈ కంపెనీ మొత్తం ఆదాయం రూ.2,50,923 కోట్ల నుంచి రూ.2,41,625 కోట్లకు తగ్గింది.  ఫస్ట్- ఇయర్ ప్రీమియం నుంచి వచ్చే ఇన్‌‌‌‌‌‌‌‌కమ్ జనవరి–-మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో రూ.11,069 కోట్లకు తగ్గింది. 

గతేడాది ఇదే పీరియడ్‌‌‌‌‌‌‌‌లో ఇది రూ.13,810 కోట్లుగా ఉంది.  రెన్యువల్ ప్రీమియంల నుంచి వచ్చే ఇన్‌‌‌‌‌‌‌‌కమ్ రూ.77,368 కోట్ల నుంచి  రూ.79,138 కోట్లకు పెరిగింది. మొత్తం మార్చి 2025తో ముగిసిన ఫైనాన్షియల్ ఇయర్‌‌‌‌‌‌‌‌లోఎల్‌‌‌‌‌‌‌‌ఐసీకి రూ.48,151 కోట్ల ప్రాఫిట్, మొత్తం ఆదాయం రూ.8,53,707 కోట్ల నుంచి రూ.8,84,148 కోట్లకు పెరిగింది. కంపెనీ ఒక్కో షేరుకు రూ.12 డివిడెండ్‌‌‌‌‌‌‌‌ ప్రకటించింది.