ఎల్‌ఐసీ లిస్టింగ్‌ రేపే!

ఎల్‌ఐసీ లిస్టింగ్‌ రేపే!

న్యూఢిల్లీ: సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌గా ఐపీఓ పూర్తి చేసిన ఎల్‌‌‌‌ఐసీ, మార్కెట్‌‌‌‌లో రేపు లిస్టింగ్ కాబోతోంది. కంపెనీ షేర్లు ఐపీఓలో రూ. 949 వద్ద అందుబాటులోకి వచ్చాయి. ఈ ధర దగ్గరే లిస్టింగ్ అయితే దేశంలోని ఐదో అతిపెద్ద కంపెనీగా (మార్కెట్ క్యాప్ పరంగా) ఎల్‌‌‌‌ఐసీ నిలుస్తుంది. ఈ కంపెనీ కంటే ముందు రిలయన్స్‌‌‌‌ ఇండస్ట్రీస్‌‌‌‌, టీసీఎస్‌‌‌‌, హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ బ్యాంక్‌‌‌‌, ఇన్ఫోసిస్‌‌‌‌లు ఉంటాయి. పాలసీహోల్డర్లకు రూ. 889 వద్ద, రిటైల్ ఇన్వెస్టర్లకు రూ. 904 వద్ద ఎల్‌‌‌‌ఐసీ షేర్లు అలాట్ అయిన విషయం తెలిసిందే. క్యూఐబీ, నాన్‌‌‌‌ ఇన్‌‌‌‌స్టిట్యూషనల్‌‌‌‌ ఇన్వెస్టర్లు, ఇన్‌‌‌‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు మాత్రం రూ. 949 వద్ద షేర్లను అలాట్ చేశారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు చూస్తే ఎల్‌‌‌‌ఐసీ షేర్లు ఫ్లాట్‌‌‌‌గా లేదా కొంత నష్టంతో మార్కెట్‌‌‌‌లో లిస్టింగ్‌‌‌‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని ఎనలిస్టులు చెబుతున్నారు. కానీ, పాలసీ హోల్డర్లు, రిటైల్ ఇన్వెస్టర్లకు కొద్దిగా లాభాలు వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఎల్‌‌‌‌ఐసీ షేర్లు నష్టాల్లో లిస్టింగ్ అయితే మాత్రం ఈ కంపెనీ షేర్ల కోసమే మొదటిసారిగా మార్కెట్‌‌‌‌లోకి ఎంటర్‌‌‌‌‌‌‌‌ అయిన వారు ఎక్కువగా నిరుత్సాహపడతారు.