
ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ (Life Insurance Corporation of India) గిన్నిస్ వరల్డ్ టైటిల్ను సొంతం చేసుకుంది. 24 గంటల వ్యవధిలో అత్యధిక లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు విక్రయించి LIC సరికొత్త రికార్డ్ సృష్టించింది. జనవరి 20, 2025న దేశవ్యాప్తంగా ఉన్న 4 లక్షల 52 వేల 839 ఎల్ఐసీ ఏజెంట్లు 5 లక్షల 88 వేల 107 పాలసీలను విక్రయించారు. పాలసీల విక్రయంలో మునుపెన్నడూ కనీవినీ ఎరుగని సరికొత్త బెంచ్ మార్క్ను క్రియేట్ చేశారు.
ఎల్ఐసీ ఏజెంట్ల అవిశ్రాంత కృషి, నైపుణ్యం, ఉద్యోగ ధర్మం పట్ల వారికి ఉన్న నిబద్ధత వల్లే ఈ అరుదైన రికార్డ్ సాధ్యమైందని ఎల్ఐసీ ఎండీ, సీఈవో సిద్ధార్థ మహంతి హర్షం వ్యక్తం చేశారు. దేశంలో బీమా రంగంలోకి ప్రైవేట్ కంపెనీలను అనుమతిచ్చి 20 ఏళ్లు దాటినప్పటికీ ఇప్పటికీ ఎల్‌ఐసీనే ఇంకా మార్కెట్ లీడర్‌గా కొనసాగుతుండటం గమనార్హం. జనవరి 20, 2025న ‘మ్యాడ్ మిలియన్ డే’ పేరుతో ఒక్కో ఎల్ఐసీ ఏజెంట్ జనవరి 20న కనీసం ఒక్క పాలసీ అయినా చేయాలని ఎల్ఐసీ ఎండీ సిద్ధార్థ మహంతి ఇచ్చిన పిలుపు మేరకు ఈ అరుదైన రికార్డ్ సాధ్యమైంది.
ALSO READ | PF News: పీఎఫ్ సభ్యులకు శుభవార్త.. వడ్డీ రేటులు ఫిక్స్, త్వరలో జమ..
ఎల్‌ఐసీలో లక్ష మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తుండగా, 13.26 లక్షల మందికి పైగా ఏజెంట్లు పనిచేస్తున్నారు. కంపెనీకి దేశంలో 8 జోనల్ ఆఫీస్‌లు, 113 డివిజినల్ ఆఫీసులు, 74 కస్టమర్ జోన్లు, 2,048 బ్రాంచ్ ఆఫీస్‌లు, 1,564 శాటిలైట్ ఆఫీసులు, 44,900 ప్రీమియం పాయింట్లు, లైఫ్ ప్లస్ ఆఫీసులు ఉన్నాయి.
అంతేకాకుండా కస్టమర్లకు మెరుగైన సర్వీస్‌లను అందించేందుకు ఎల్‌ఐసీ దేశంలోని 74 బ్యాంకులతో పార్టనర్‌షిప్ కుదుర్చుకుంది. ఎండోమెంట్ ఇన్సూరెన్స్, టెర్మ్ ఇన్సూరెన్స్, చైల్డ్ ఇన్సూరెన్స్, యాన్యుటీ, మైక్రో ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ వంటి వివిధ సెగ్మెంట్లలో మొత్తం 33 ప్లాన్లను ఎల్‌ఐసీ అమ్ముతోంది. పాలసీ హోల్డర్లు తమ ప్రీమియంను ఆన్‌లైన్‌లో చెల్లించే అవకాశాన్ని తీసుకొచ్చింది.
Life Insurance Corporation of India is proud to announce that it has earned a GUINNESS WORLD RECORDS™. Title for "Most Life Insurance Policies sold in 24 hours". On 20-01-2025, a total of 4,52,839 agents of LIC of India successfully completed an astounding 5,88,107 life…
— LIC India Forever (@LICIndiaForever) May 24, 2025