గత నెల 6.01% పెరిగిన ఎన్బీపీ... జీవిత బీమా మండలి వెల్లడి

గత నెల 6.01%  పెరిగిన ఎన్బీపీ... జీవిత బీమా మండలి వెల్లడి

న్యూఢిల్లీ: భారతీయ జీవిత బీమా సంస్థల గత నెల కొత్త బిజినెస్ ప్రీమియంల (ఎన్‌‌‌‌‌‌‌‌బీపీలు) వసూళ్లు గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 6.01 శాతం పెరిగాయని జీవిత బీమా మండలి ప్రకటించింది. మొత్తం ఎన్‌‌‌‌‌‌‌‌బీపీల విలువ రూ.1,54,193.76 కోట్ల నుంచి రూ.1,63,461.52 కోట్లకు పెరిగింది. పర్సనల్, సింగిల్ ప్రీమియంలు 9.71 శాతం వృద్ధి చెందగా, వ్యక్తిగత, నాన్-సింగిల్ ప్రీమియంలు కూడా 4.51 శాతం వృద్ధిని సాధించాయి. 

జీవిత బీమా సంస్థలు మొదటిసారి జీవిత బీమా కొనుగోలుదారులకు అవసరమైన ఉత్పత్తులను అందించడంపై ఎక్కువగా దృష్టి పెట్టడంతో భారీ వృద్ధి సాధ్యపడింది. బీమా సౌకర్యం సరిగా లేని ప్రాంతాలను, జనాభాను చేరుకోవడానికి ఇండస్ట్రీ అన్ని ప్రయత్నాలూ చేస్తోందని మండలి తెలిపింది. కంపెనీలు గత నెల 4,37,125కు పైగా కొత్త ఏజెంట్లను నియమించుకున్నాయి.