ఫోర్త్ ప్లోర్ నుండి గ్రౌండ్ ప్లోర్ లో పడిన లిఫ్ట్..ఆరుగురికి తీవ్ర గాయాలు...

ఫోర్త్ ప్లోర్ నుండి గ్రౌండ్ ప్లోర్ లో పడిన లిఫ్ట్..ఆరుగురికి తీవ్ర గాయాలు...

నాగోల్ లోని కిన్నెర గ్రాండ్ హోటల్ లో దారుణం చోటు చేసుకుంది.హోటల్ లిప్ట్ నాలుగో ఫ్లార్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్లోకి పడింది.ఈ ఘటనలో లిప్ట్ లో ఉన్న 6 మందికి తీవ్ర గాయాలయ్యాయి. నాగోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని కిన్నెర గ్రాండ్ హోటల్లో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది.వివరాల్లోకి  వెళితే, నాగోలు అల్కాపురిలోని కిన్నర గ్రాండ్ హోటల్లో ఆదివారం ఎల్బీనగర్ ప్రాంతానికి చెందిన ఓ కుటంబం ఎంగేజ్మెంట్ పంక్షన్ నిర్వహించారు. పంక్షన్ కు హాజరైన 8 మంది నాలుగో ఫ్లోర్ నుండి కిందకు వచ్చేందుకు లిఫ్ట్ ఎక్కారు. 

ఈ క్రమంలో లిఫ్ట్ మెషినరీ సరిగా పనిచేయకపోవడంతో ఒక్కసారిగా  నాలుగో ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ప్లోర్ కి ఒక్కసారిగా వచ్చి పడింది లిఫ్ట్. వేగంగా వచ్చి పడటంతో లిప్ట్ డోర్లు పగిలి అందులో ఉన్న 6మందికి తీవ్ర గాయాలు కాగా, వారిని చికిత్స నిమిత్తం 108లో సమీపంలోని కామినేని హాస్పిటల్ కు తరలించారు. ఇందులో ఉన్న మరో ఇద్దరు ఎలాంటి గాయలు కాలేదు. గాయపడిన వారు నగరంలో వివిధ ప్రాంతాలను చెందిన వారని తెలుస్తోంది.ఈ మేరకు నాగోలు పోలీసులు కిన్నెర గ్రాండ్ హోటల్ పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.