జమ్మూలో ఆంక్షలు ఎత్తివేత

జమ్మూలో ఆంక్షలు ఎత్తివేత

పార్లమెంట్ లో జమ్మూ కశ్మీర్ పునర్విభజన బిల్లు, ఆర్టికల్ 370 రద్దు బిల్లులను ప్రవేశపెట్టడానికి రెండు రోజుల ముందు నుంచి జమ్ములో విధించిన ఆంక్షలను పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ఇదే సమయంలో పోలీసు బందోబస్తు మాత్రం కొనసాగుతుందని ప్రజలంతా సహకరించాలని కోరారు జమ్ముకశ్మీర్ అదనపు డీజీపీ మునీర్ ఖాన్. ఏ విధమైన పుకార్లనూ నమ్మవద్దని, పరిస్థితి పూర్తిగా ప్రశాంతంగా ఉందని, ప్రతి ఒక్కరూ తమ పనులను తాము చేసుకోవచ్చని తెలిపారు.

కశ్మీర్ లోయలోని కొన్ని ప్రాంతాల్లో మరి కొద్ది రోజులు 144 సెక్షన్ వంటి ఆంక్షలను అమలు కొనసాగుతుందని తెలిపారు. ప్రత్యేక పోలీసు బలగాల ఉపసంహరణను ప్రారంభించామని అన్నారు. పరిస్థితులు చక్కబడుతున్న కొద్దీ దశలవారీగా అదనపు సైన్యాన్నంతా వెనక్కు పంపివేయనున్నట్లు మునీర్ ఖాన్ తెలిపారు.